Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు..తుఫాన్‌ నేపథ్యంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లు

గత కొన్ని సంవత్సరాలుగా నవంబర్‌ నెలలో లేదా దీపావళికి ఏపీలో తుఫాన్‌ ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఏపీ ప్రజలకు భారత వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడిరచింది. ఈ తుఫాన్‌ కు సిత్రాంగ్‌ తుపాను గా నామకరణం చేశారు. సిత్రాంగ్‌ తుపాను ఈశాన్య దిశగా పయనిస్తూ, ఒడిశా తీరాన్ని దాటి, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాలను సమీపిస్తుందని వివరించింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాలపైనే చూపనున్నదని.. అది కూడా స్వల్ప ప్రభావం ఉండనున్నదని పేర్కొంది.గతంలో నవంబర్‌ లో వచ్చిన తుఫాన్‌ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని.. సిత్రాంగ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్‌ ప్రభావం పడనున్న దాదాపు 105 మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.. అంతేకాదు ఇప్పటికే ఆయా మండలాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.. అన్ని రకాలుగా తుఫాన్‌ ను ఎదుర్కోవడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్‌ తెలిపారు.అంతేకాదు.. బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడనున్న నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలో వేటకు అక్టోబర్‌ 26వ తేదీ వరకూ వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. త్యవసర సహాయార్ధం ఇప్పటికే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరికైనా తుఫాన్‌ గురించి సమాచారం.. కావాలంటే.. 1070, 1800 4250101, 0863 2377118 నెంబర్లకు ఫోన్‌ చేయాల్సిందిగా సూచించారు. ఈ హెల్ప్‌ లైన్‌ 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img