Friday, May 31, 2024
Friday, May 31, 2024

మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : సీఎం జగన్‌

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. భోగి సందర్భంగా సీఎం నివాసం వద్ద సంబరాలు జరిగాయి. గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని సీఎం జగన్‌ అన్నారు.ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img