Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజికి ప్రారంభోత్సవం
అనంతరం సంగంలో బహిరంగ సభ

సీఎం వైఎస్‌ జగన్‌ రేపు (సెప్టెంబరు 6) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నా నదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిని ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటన నిమిత్తం రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్‌ గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరతారు. 10.40 గంటలకు సంగం బ్యారేజి వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం, అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన బ్యారేజి కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్నాహ్నం 2.20 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో, నెల్లూరు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img