Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

విద్యా దీవెన అర్ధం లేని ఆలోచన

ఎంపీ రఘురామ కృష్ణంరాజు
అది జగనన్న విద్యా దీవెన కాదని, వంచన అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వసతి దీవెన కూడా సగం మాత్రమే వస్తోందని, చాలా మందికి బెనిఫిట్‌ రావడం లేదని అన్నారు. తల్లి అకౌంట్‌లో డబ్బులు వేసి దాన్ని కాలేజీలకు ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఓట్ల కొనుగోలులో భాగమా ఇది? అని అన్నారు. విద్యా దీవెన అర్ధం లేని ఆలోచనని అన్నారు. ఇకనైనా విద్యా దీవెనలు తల్లులకు ఇవ్వడం మానేసి కాలేజీలకు ఇవ్వాలని సూచించారు. వైసీపీ ఓట్ల కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img