Monday, March 20, 2023
Monday, March 20, 2023

విశాఖలో ట్రాఫిక్‌ నిలిపివేత.. మళ్లీ రిపీట్‌ కాకూడదు : సీఎం జగన్‌

విశాఖలో నిన్న తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం పర్యటన సందర్భంగా.. నగరంలో గంటల తరబడి అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. దీనిపై సీఎం సీరియస్‌ అయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎందుకు నిలిపేశారని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై ఆయన సీరియస్‌ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. వెంటనే విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img