Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

విశాఖ జూలో వైట్ టైగర్ కుమారి కన్నుమూత..

విశాఖ జూలో గత 20 సంవత్సరాలుగా ప్రత్యేక ఆకర్షణగా ఉన్న వైట్ టైగర్ కుమారి సోమవారం కన్నుమూసింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వైట్ టైగర్ కు వెటర్నరీ వైద్యులు గత కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో సోమవారం జూ లోనే కన్నుమూసింది. 2004 సంవత్సరంలో హైదరాబాద్ జూ లో ఈ వైట్ టైగర్ కుమారి జన్మించింది. ఆ తర్వాత అక్కడి నుంచి దానిని విశాఖపట్నం జూ కు తరలించారు. అరుదైన తెల్ల పులి ఎందరో పర్యాటకులను ఆకర్షించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న ఏకైక తెల్ల పులి కుమారి కావడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img