Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

శుభంకార్డు పడినట్టే..

ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం : చిరంజీవి

సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడిరదని భావిస్తున్నామని ప్రముఖ సినీనటుడు చిరంజీవి పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్‌ ఆమోదం తెలిపారన్నారు. చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇండస్ట్రీ సమస్యలపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ తరపున ఏపీ సీఎంకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, చర్చలు నిర్వహించేలా చొరవ తీసుకున్నందుకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్ల అంశంలో గత కొద్ది నెలలుగా గందరగోళంలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద ఉపశమనం లభించిందని అన్నారు. రానున్న పదిరోజుల్లో ఓ శుభవార్త మన ముందుకు రాబోతోందన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై స్పందించి చర్చలకు ఆహ్వానించిన మంత్రి పేర్నినానికి, సీఎం జగన్‌కు మహేష్‌ బాబు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img