Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

సమ్మెల వల్ల ఉపయోగం ఉండదు : సజ్జల

ఉద్యోగులు బలప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదని, చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం అవుతుందని అన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. బయటి శక్తుల ప్రమేయంతో ఉద్యోగులకు ఇబ్బందులొస్తాయన్నారు. సంబంధం లేని ఇష్యూలు హైలెట్‌ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉద్యోగులు నియంత్రణ కోల్పోయి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ సమస్యలను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img