Monday, March 20, 2023
Monday, March 20, 2023

సహకార బ్యాంకులను కాపాడుకోవాలి : సీఎం జగన్‌

సహకార బ్యాంకుల ద్వారా వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సహకార శాఖపై సమీక్షలో భాగంగా రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరును సీఎం జగన్‌ సమీక్షించారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్‌, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిపారు. సహకార బ్యాంకులు మన బ్యాంకులు వాటిని మనం కాపాడుకోవాలని అన్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎంత వెసులుబాటు ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఆదేశించారు.బ్యాకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలన్నారు. ఈ పోటీని తట్టుకునేందుకు అకర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయని అన్నారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపునకు తిప్పుకోవచ్చని, తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుందని అన్నారు. రుణాల మంజరులో ఎక్కడా రాజీ ఉండకూడదు. రాజకీయాలకు చోటు ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img