Friday, October 7, 2022
Friday, October 7, 2022

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు

: ఎమ్మెల్సీ అశోక్‌ బాబు
టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహముందని అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని జగన్‌ గుర్తుంచుకోవాలన్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్‌ అయిందన్నారు. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్‌ చేసిందని తెలిపారు. బోర్డు మెంబర్లు కూడా ప్రత్యేక పత్రాలు ఇవ్వడంతో సామాన్యులకు దర్శనం గగనమైందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img