Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అభిమాన నేతకు అశ్రునివాళి

జర్నలిస్టు ఉద్యమ నేత అంబటికి ప్రముఖుల నివాళి
తరలివచ్చిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే శ్రేణులు

విశాలాంధ్ర – విజయవాడ: జర్నలిస్టు ఉద్యమ నేత అంబటి ఆంజనేయు లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నేతను కడసారి దర్శించి శ్రద్ధాంజలి ఘటిం చారు. విజయవాడలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర గౌరవ సలహాదారు అంబటి ఆంజనేయులుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నాయకులు నివాలులర్పించారు. సోమవారం దుర్గాపురంలోని అంబటి ఆంజనేయులు నివాసానికి నేతలు వచ్చి అంబటి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులుర్పించి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గరే బంధువులు, సన్నిహితుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం గాంధీనగర్‌లోని విజయవాడ ప్రెస్‌ క్లబ్‌కు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. జర్నలిస్టు యూనియన్‌ నాయకులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు ,రాజకీయ నాయకులు సందర్శించి అభిమాన నేతకు అశ్రునివాళులర్పించారు. కృష్ణలంకలోని స్వర్గపురిలో అంబటి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
నివాలులర్పించిన వారిలో ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి డి.సోమసుందర్‌, కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్‌కుమార్‌, కె.సత్యనారాయణ, వై.నరేంద్రరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్‌, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్‌.బాబూరావు, వై.వెంకటేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్‌, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటీవ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు, న్యూస్‌ ఎడిటర్‌ మోదుమూడి మురళీకృష్ణ, పజాశక్తి ఎడిటర్‌ ఆర్‌.తులసీరావు. ఐజేయు జాతీయ సమితిసభ్యులు ఎస్‌కే.బాబు, తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్సు కార్యదర్శి విరహత్‌ అలి, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షులు చావా రవి, ప్రధాన కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణణారెడ్డి ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావ్‌, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, అధికార భాషా సంఘం చైర్మన్‌ పి.విజయబాబు, సీఆర్‌ మీడియా అకాడమి కార్యదర్శి తిలక్‌, ఆంధ్రప్రదేశ్‌ మీడియా ప్రొఫిషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్‌ యాదవ్‌, కార్యదర్శి వైవీరమణ, తదితరులు ఉన్నారు.
విలువలతో కూడిన సేవలు అందించారు: సీపీఐ కార్యదర్శి నారాయణ: అంబటి ఆంజనేయులు మృతికి సీపీఐ జాతీయకార్యదర్శి కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. చివరి శ్వాస వరకు జర్నలిస్టుగా విలువలతో కూడిన సేవలు అందించారని కొనియాడారు. జర్నలిజానికే పరిమితం కాకుండా సమాజానికి అర్థవంతమైన సేవలం అందించారని పేర్కొన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టకుండా నిజ జీవితానికి అంకితమైన అంబటి మృతికి సంతాపం, కుటుంబసభ్యులు సానుభూతి తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ వేర్వేరు ప్రకటనల్లో అంబటి ఆంజనేయులు మృతికి సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img