Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్‌టీఆర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.. రిటైర్‌ అయ్యాక పుస్తకమే రాస్తా

: జస్టిస్‌ ఎన్వీ రమణ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారం తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన రెండు ప్రత్యేక కోర్టులను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. తిరుపతిలోని ఆల్‌ ఇండియా రేడియో కార్యాలయం సమీపంలోని తుడా కాంప్లెక్స్‌లో ఈ కోర్టులు ఏర్పాటుచేశారు. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అవార్డులు ప్రదానం చేశారు. వివిధ రంగాలకు చెందిన 18 మంది ప్రధాన న్యాయమూర్తి చేతులుమీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. మహానటుడు ఎన్టీఆర్‌తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందిస్తాయని అన్నారు. ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని.. పార్టీ ప్రారంభించిన తర్వాత నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ప్రజలకు విశేష సేవలందించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అన్యాయమని సీజేఐ రమణ వ్యాఖ్యానించారు. ‘‘ఎన్టీఆర్‌తో నాకు కొంత సాన్నిహిత్యం ఉంది.. 1989 నుంచి ఎన్టీఆర్‌ మనిషిగా నాపై ముద్ర వేశారు.. ఆయన మనిషిగా ఉండటాన్ని నేను గర్విస్తున్నా.. రాజకీయ పార్టీకి సిద్ధాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్‌.. పదవీ విరమణ తర్వాత ఆయనపై పుస్తకం రాస్తా.. తన స్వలాభం కోసం కాకుండా ప్రజా సేవ కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశంసలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img