Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పరిహారం చెల్లింపులో విఫలం

పోలవరం నిర్వాసితులను పట్టించుకోని పాలకులు
జేవీ సత్యనారాయణమూర్తి, హరినాథరెడ్డి విమర్శ

విశాలాంధ్రఆదోని: పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్యతో కలిసి వారు శుక్రవారం స్థానిక కింగ్‌ ప్యాలెస్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం జగన్‌ ఎలాంటి పోరాటం చేయడం లేదని సత్య నారాయణమూర్తి విమర్శించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్‌ ఊసేలేదని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనైనా జగన్‌ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచా ల్సిందని వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి బేష రతుగా మద్దతివ్వడం దారుణమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మోదీ సర్కారు ప్రైవేటుకి అప్పగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రభుత్వ విధానా లను ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, జైళ్లకు పంపుతున్నారని జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతల నుంచి పోలీసులు ఎప్పుడో తప్పుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వారానికో లాకప్‌ డెత్‌ జరుగుతోందన్నారు. నిత్యావసర వస్తువులపై కేంద్రం జీఎస్‌టీ విధించడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఒక్కటై మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. జగన్‌ సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడిరదని హరినాథరెడ్డి విమర్శించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తికాలేదు. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. అమ్మఒడి పథకంలో కోటిన్నర మందికి కోత విధించారు. అంగన్‌వాడీ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను అనర్హులుగా గుర్తించారని విమర్శించారు. వాహనమిత్రలో 9 లక్షల మంది అర్హులకుగాను 2.40లక్షల మందికి మాత్రమే అందజే శారన్నారు. పన్నుల రూపంలో రూ.20 వేలు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..వాహనమిత్ర పేరుతో కేవలం రూ.10వేలు మాత్రమే ఇవ్వడం దుర్మార్గ మన్నారు. సీపీఎస్‌ రద్దుపై సీఎం జగన్‌ మాటతప్పారని విమర్శిం చారు. అభివృద్ధి సంక్షేమం రెండూ ఏకకాలంలో కొనసాగాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హరినాథరెడ్డి సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img