Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

యువజన వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర, నక్కి లెనిన్‌ బాబు

విశాలాంధ్ర`అనకాపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర, నెక్కి లెనిన్‌ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఏఐవైఎఫ్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, యువత దీనిపై పెద్ద ఎత్తున పోరాడా లని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వే, స్టీల్‌ ప్లాంట్‌తో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి యువతను మోసగించే పనిలో ఉన్నదన్నారు. అదే కోవలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమలు తీసుకొచ్చే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పిన జగన్‌, సచివాలయ ఉద్యోగుల తోనే పబ్బం గడుపుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు అందరూ కలిసి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఏఐవైఎఫ్‌ మాజీ నాయకులు, అనకాపల్లి జిల్లా సీపీఐ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ సహాయ కార్యదర్శి రాజాన దొర బాబు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
ఏఐవైఎఫ్‌ అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా వేముల కన్నబాబు, వియ్యపు రాజు, ఉపాధ్యక్షుడిగా డొక్కరి హరీష్‌, సహాయ కార్యదర్శిగా నాగమణి, కోశాధికారిగా కనకరాజు. సమితి సభ్యులుగా సీహెచ్‌ శ్రీను, బి.బాలాజీ, జి అప్పలరాజు, బి అశోక్‌, నాగరాజు, పి వెంకటేష్‌, కౌశిక్‌, చైతన్య, సురేష్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img