Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

హజరీబాగ్‌లో త్రిముఖ పోరు

. సీపీఐ అభ్యర్ధి విస్తృత ప్రచారం
. అనిరుథ్‌నే గెలిపిస్తామంటున్న ప్రజలు
. బీజేపీకి యశ్వంతసిన్హా కుటుంబ దెబ్బ

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి బలమైన స్థానాలలో ఒకటైన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వ్యాపారవేత్త, ఫిరాయిం పుదారు, ప్రజల మనిషి మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్‌ సిన్హాను ఓడిరచిన ఘనత సీపీఐ అభ్యర్థికి ఉంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం భారత రాజకీయాల్లో ప్రసిద్ధి చెందిన రాజకీయ శక్తికి కేంద్రంగా ఉంది. హజారీబాగ్‌లో విభిన్న వర్గాల జనాభా ఉన్నారు. జార్ఖండ్‌లో కీలకమైన నియోజకవర్గంగా ఉంది. ఈ ఎన్నికలలో,ఓటర్లు తమ ఓటు శక్తిని చూపించడా నికి, జన నేతను ఎన్నుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నారు. హజారీబాగ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2024 అభ్యర్థుల జాబితా విషయానికొస్తే, భారతీయ జనతా పార్టీ నుంచి వ్యాపారవేత్త మనీశ్‌ జైస్వాల్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయింపుదారు జై ప్రకాశ్‌భాయ్‌ పటేల్‌, సీపీఐ అభ్యర్థిగా ప్రజల కోసం నిరంతరం శ్రమించే అనిరుధ్‌ కుమార్‌ పోటీపడుతున్నారు. 1977 నుంచి హజారీబాగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేస్తోంది. రెండుసార్లు శక్తివంతమైన నాయకుడు , కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను సీపీఐ అభ్యర్థి ఓడిరచారు. గత నలభై ఏళ్లుగా హజారీ బాగ్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలవలేక పోయింది, అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ స్థానానికి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది. ఆ అభ్యర్థి ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. దానితో ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ ఫిరాయింపు రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, వినాశకర విధానాలతో విసిగిపోయిన హజారీబాగ్‌ నియోజకవర్గ ప్రజలు ఈ సారి సీపీఐ అభ్యర్థి అనిరుధ్‌ కుమార్‌ను ఎక్కువ ఓట్లతో గెలిపించి లోక్‌సభకు పంపుతారనీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ రెండిరటినీ ఓడిరచగల సత్తా భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జార్ఖండ్‌లో 14 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. హజారీబాగ్‌ నియోజకవర్గం బర్హి, బర్కగావ్‌, రామ్‌గఢ్‌, మండు, హజారీబాగ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ ప్రధాన పార్టీలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి జయంత్‌ సిన్హా 4,79,548 ఓట్ల తేడాతో గెలుపొందారు. జయంత్‌ సిన్హా 728,798 (67.00%) ఓట్లను సాధిం చారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గోపాల్‌ ప్రసాద్‌ సాహుకు 249,250 (23.05 %) ఓట్లు పొందారు. సీపీఐ అభ్యర్థి భువనేశ్వర్‌ ప్రసాద్‌ మెహతా మూడో స్థానంలో నిలిచారు. ఈ దఫా సీపీఐ అభ్యర్థిని మార్చడం ద్వారా కొత్త సమీకర ణానికి తెరలేపింది. నియోజకవర్గంలో ముక్కోణపు పోరు తప్పలేదు. నియోజకవర్గంలో అనిరుథ్‌ కుమార్‌కు మంచి పేరుంది. పీడిత ప్రజల నాయకునిగా ఆయన గుర్తింపు పొందారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ఆయనకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. గతంలో సీపీఐ తరపున గెలుపొందిన భువనేశ్వర్‌ ప్రసాద్‌ మెహతా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మినహా తరువాత గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు చేసిన అభివృద్ధి ఏమీ లేదనీ, అందుకని తాము సీపీఐ అభ్యర్థినే గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. అనిరుధ్‌ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలతో స్వాగతంపలికి కంకీ`కొడవలి గుర్తుకే ఓటువేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అనిరుధ్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. పేద రైతు కుటుంబంలో జన్మించిన భువనేశ్వర్‌ ప్రసాద్‌ మెహతా హజారీబాగ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయనను జార్ఖండ్‌ స్టాలిన్‌ అని పిలుస్తారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బీజేపీికి చెందిన యశ్వంత్‌ సిన్హాను 2004 ఎన్నికల్లో ఆయన మట్టికరిపించారు. మెహతా చేసిన అభివృద్ధి, రాజకీయ పలుకుబడి అనిరుధ్‌కు అదనం.
బీజేపీపై యశ్వంత్‌ సిన్హా ప్రభావం
ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిపై ఆ పార్టీ మాజీ ఎంపీ యశ్వంత్‌ సిన్హా కుటుంబ ప్రభావం బాగా ఉంటుంది. తండ్రి యశ్వంత్‌ ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వడం, కుమారుడు జయంత్‌ పోటీకి దూరంగా ఉండడం బీజేపీని చిక్కుల్లో పడేసింది. హజారీబాగ్‌ సదర్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యాపారవేత్త మనీశ్‌ జైస్వాల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జై ప్రకాశ్‌ భాయ్‌ పటేల్‌, మాండు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యశ్వంత్‌ సిన్హా కుమారుడు, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ జయంత్‌ సిన్హా పోటీ నుంచి వైదొలగడంతో హజారీబాగ్‌లో 1998 తర్వాత మొదటిసారిగా సిన్హా కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో లేరు. జయంత్‌ 2014, 2019 ఎన్నికలలో హజారీబాగ్‌ నుంచి ఎన్నికయ్యారు. ఆయన తండ్రి యశ్వంత్‌ సిన్హా 1998, 1999, 2009లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2004లో యూపీఏ మద్దతు గల సీపీిఐ అభ్యర్థి భువనేశ్వర్‌ మెహతా చేతిలో ఓడిపోవడంతో యశ్వంత్‌ సిన్హా విజయ పరంపరకు మధ్యలోనే ఆటంకం కలిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జైస్వాల్‌ మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మే 20న ఐదో దశలో జార్ఖండ్‌లో పోలింగ్‌ జరగనుంది. నార్త్‌ చోటానాగ్‌పూర్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చే హజారీబాగ్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
హజారీబాగ్‌లో కుర్మీ, కుష్వాహా, సుకియార్‌, వైశ్య, ముస్లిం ఓట్లు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. పటేల్‌ ఒక కుర్మీ, ఓబీసీ అయితే, జైస్వాల్‌ వైశ్య కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాను జైస్వాల్‌ వ్యక్తం చేశారు. ‘‘హజారీబాగ్‌ ప్రజలు మమ్మల్ని రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నుకున్నారంటే, అది బీజేపీపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. యశ్వంత్‌ సిన్హా హజారీబాగ్‌ ప్రజల మధ్య ఎన్నడూ లేరు. ఆయన, కాంగ్రెస్‌ ఎంత ప్రయత్నించినా నరేంద్ర మోదీ ప్రజాకర్షక ప్రభావం ముందు నిలబడలేరు’ అని బీజేపీ అభ్యర్థి కలలు కంటున్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ అభ్యర్థి పటేల్‌ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img