Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

12న మోదీ రామగుండం పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు..

విభజన చట్టాలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటూ సంవత్సరం క్రితమే రామగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభమైనా వారి వ్యక్తిగత ప్రచారం కోసం ఈ నెల 12వ తేదీన రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామగుండం పర్యటనకు రావడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల నుండి అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక కార్పోరేట్‌ అనుకూల ప్రభుత్వరంగ పరిశ్రమలను మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తూ చట్టం చేయడం లాంటి చర్యలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తెలంగాణ ప్రజల నుండి ఇప్పటికే నిరసనలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ గుండెకాయ అయిన సింగరేణిని ప్రైవేటీకరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూనుకోవడము కాకుండా ఇప్పటికీ రామగుండం మైనింగ్‌ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం జరిగింది. సత్తుపల్లి ఓసీ-3, మందమర్రి దగ్గర శ్రీరాంపల్లి 3.3-6 (కళ్ళఖని) మైనింగ్లను ప్రైవేట్‌ వారికి అప్పగించే ప్రయత్నం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పీఎం. గో బ్యాక్‌ తెలంగాణ ప్రజలు ద్వేషి పేరుతో పెద్దఎత్తున నల్ల జెండాలతో నిరసనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img