Monday, April 22, 2024
Monday, April 22, 2024

15 రోజుల్లో భూ పత్రాలు .. ఇదొక మహాయజ్ఞం..సీఎం జగన్‌

15 రోజుల్లో అందరికీ భూ పత్రాలు అందిస్తామని.. ఇదొక మహాయజ్ఞం అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, రెండో దశ సర్వే పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయన్నారు. జానెడు కూడా తప్పు జరగకుండా సర్వే చేయిస్తున్నామన్నారు. మీ భూమి – మా హామీ పేరుతో వందేళ్ల తర్వాత భూ రీ సర్వే జరుగుతుందన్నారు. ఇక భూ వివాదాలు, కబ్జాలు ఉండవన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ పనుల్లోనూ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. సర్వే ద్వారా ఇప్పటికే 2లక్షల మ్యుటేషన్‌ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img