Friday, May 17, 2024
Friday, May 17, 2024

మంత్రాలయంలో త్రిముఖ పోరు

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటిగా మంత్రాలయం ఉంది. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పడిరది. మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు మండళ్లు ఉన్నాయి. 2009లో తొలిసారి ఎన్నికలు జరిగిన నాటి నుంచి వై.బాలనాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలవగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లోనూ వైసీపీ తరపున బరిలోకి దిగారు. టీడీపీ తరపున ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి, కాంగ్రెస్‌ తరపున మురళీకృష్ణ దొర పోటీ చేస్తున్నారు. దీంతో నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. కాగా, తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దళవాయి రామయ్యపై బాలనాగిరెడ్డి (టీడీపీ) విజయం సాధించారు. ఆ తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో బాలనాగిరెడ్డి చేరారు. వైఎస్‌ఆర్‌ మృతి తరువాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైసీపీలోకి వెళ్లారు. బాలనాగిరెడ్డి 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా రంగంలో దిగి… టీడీపీ అభ్యర్థిగా తిక్కారెడ్డిని ఓడిరచారు. 2019లో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై మరో విజయాన్ని నమోదు చేశారు. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా నిలిచారు. నాల్గోసారి బరిలో నిలిచిన ఆయనకు మంత్రాలయం ప్రజలు మరో విజయాన్ని అందిస్తారా లేక కొత్త వారికి అవకాశమిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని సాగిస్తూ తమ గెలుపు కోసం కృషిచేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జిల్లా కేంద్రం కౌతాళంలో బహిరంగ సభ నిర్వహించారు.
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img