Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఉంగుటూరులో గెలుపు ఎవరిది?

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ప్రత్యేకం. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంటు ఉన్నది. గత 12 ఎన్నికల్లో ఇదే సెంటిమెంటు ఫలించింది. దీంతో తాజా ఎన్నికల్లోనూ ఉంగుటూరు కీలక స్థానంగా మారింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎన్డీయే తరపున జనసేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు, వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు), కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాతపాటి హరి కుమార రాజు పోటీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగబోతోంది.

వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ

ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడిరది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ తరువాత వైసీపీ గెలిచింది. నియోజక వర్గంలో ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాలు ఉన్నాయి. ఇక్కడి 214 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 2,5,334 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,01,152 మంది పురుషులు, 1,04,177 మంది మహిళలు ఉన్నారు.
భౌగోళిక పరిస్థితులు: జిల్లాల పున:ర్విభజనలో ఉంగుటూరు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. భౌగోళికంగా మెట్ట, డెల్టా, కొల్లేరు, అటవీ ప్రాంతం మధ్యలో ఉంది. తూర్పున తాడేపల్లిగూడెం నియోజకవర్గం (పశ్చిమ గోదావరి), పడమర దెందులూరు నియోజకవర్గం (ఏలూరు జిల్లా), దక్షిణాన ఉండి నియోజకవర్గం (పశ్చిమ గోదావరి జిల్లా), ఉత్తరాన గోపాలపురం నియోజకవర్గం (తూర్పుగోదావరిజిల్లా) ఉన్నాయి. జాతీయ రహదారి ఏలూరు గోదావరి కాలువ, రైల్వే లైను సమాంతరంగా ఏలూరు తాడేపల్లిగూడెం పట్టణాల మధ్యలో విస్తరించి ఉంది. వరి పంటోత్పత్తి ఉంగుటూరు మండలంలో ఎక్కువ. జాతీయ రహాదారిని ఆనుకుని ఉండటంతో చేపలు, ఇతర ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించే సదుపాయం ఉంటుంది.
బస్టాండు… ఆసుపత్రి లేవు
ఉంగుటూరు నియోజకవర్గం ఏర్పడి 75ఏళ్లు అయ్యింది. 12 సార్లు ఎన్నికలు జరిగాయి. నేటికీ అభివృద్ధికి లేదు. ఉంగు టూరుకు బస్టాండు లేదు, ఆసుపత్రి లేదు. ఉన్న రైల్వేస్టేషన్‌ కూడా మూతబడిరది. నియోజకవర్గంలో రోడ్లు అంతంత మాత్రమే కాగా ఏలూరు ప్రధాన కాలువ పై వంతెన సంగతిని పట్టించుకున్న వారే లేరు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నేతలకు స్థానికుల సమస్యలు పట్టడంలేదన్నది ఉంగుటూరు ప్రజల ఆవేదన. కాగా, గణపవరం, నిడమర్రులో చేపల చెరువులు ఉండటంతో నీరు కలుషితమై రెండు మండలాల్లో తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నాయకులు చొరవ చూపడంలేదు.
గత ఎన్నికల్లో గెలుపోటములు
1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతలపాటి సూర్యచంద్ర వరప్రసాద మూర్తిరాజు 4,006 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి వట్టి రంగ పార్ధసారధిపై గెలిచారు. 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థి మూర్తి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థి మాగంటి భూపతిరావుపై కడియాల సత్యనారాయణ (కాంగ్రెస్‌) 16,375 ఓట్లతో విజయం సాధించారు. 1983లో చింతలపాటి మూర్తిరాజు(కాంగ్రెస్‌)పై కంఠమనేని శ్రీనివాసరావు (టీడీపీ) 25,180 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1985 ఉప ఎన్నికల్లో కంఠమనేని శ్రీనివాసరావు (టీడీపీ)… దశక లక్ష్మణశాస్త్రి (కాంగ్రెస్‌)పై పోటీ చేసి 29,519 ఓట్లతో విజయం సాధించారు. 1989లో కంఠమనేని శ్రీనివాసరావు(టీడీపీ)పై చావా రామకృష్ణారావు (కాంగ్రెస్‌) 20,104 ఓట్లతో గెలుపొందారు. 1994లో కొండ్రెడ్డి విశ్వనాథం (టీడీపీ)… కాంగ్రెస్‌ అభ్యర్థి చావా రామకృష్ణారావు (కాంగ్రెస్‌)పై 18,862 ఓట్లతో విజయం సాధించారు. 1999లో కొండ్రెడ్డి విశ్వనాథం(టీడీపీి)… చావా రామకృష్ణారావు(కాంగ్రెస్‌)పై 3,302ఓట్లతో గెలిచారు. 2004లో వట్టి వసంతకుమార్‌ (కాంగ్రెస్‌), టీడీపీ అభ్యర్ధి ఇమ్మణ్ణి రాజేశ్వరిపై 15,661 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో వట్టి వసంత కుమార్‌ (కాంగ్రెస్‌)… గన్ని లక్ష్మీకాంతం (టీడీపీ)పై 6,459 ఓట్లతో విజయం సాధించారు. 2014లో గన్ని వీరాంజనేయులు (టీడీపీి)… పుప్పాల శ్రీనివాసరావు (వైసీపీ)పై 8,930 ఓట్లతో గెలుపొందారు. 2019లో పుప్పాల శ్రీనివాసరావు(వైసీపీ)… గన్ని వీరాంజనేయులు (టీడీపీి)పై 33,153 ఓట్ల మెజార్టీలో గెలిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img