Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

తిరుపతి అభివృద్ధి కోసం మురళిని గెలిపించండి

హరినాథరెడ్డి

విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి అభివృద్ధి కోసం ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ అభ్యర్థి పి.మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలోని ఇందిరా నగర్‌, బాలాజీ కాలనీ, నెహ్రూనగర్‌, ఐఎస్‌ మహల్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో మంగళవారం సీపీఐ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకో వడంతో పాటు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తిరుపతి ఎమ్మెల్యేగా సీపీఐ అభ్యర్ధి మురళిని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా హరినాథరెడ్డి మాట్లాడుతూ… మురళిని గెలిపించి తిరుపతి అభివృద్ధికి దోహదపడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఇందిరానగర్‌ కమ్యూనిస్టు పార్టీ కృషితో ఏర్పడిరదని గుర్తు చేశారు. అప్పట్లో కమ్యూనిస్టు నేత బాలాజీ ఇక్కడి నుంచి కౌన్సిలరుగా విజయం సాధిం చారని… అప్పుడే ఇందిరానగర్‌లో సిమెంటు రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారన్నారు. ఆ తరువాత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడ చూసినా మురుగు నీరు పారు తోందని, సిమెంటు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. తిరుపతి స్మార్ట్‌ సిటీ అని చెబుతున్న నేతలు… ఇందిరానగర్‌ కు వచ్చి చూస్తే అభివృద్ధి ఎలా ఉందో అర్థమవుతుందని సూచించారు. ప్రధాన రహదారుల్లో ఆకర్షణీయమైన బొమ్మలు వేసి ఇదే అభివృద్ధి అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి స్వార్థంతో తనకు అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే రోడ్ల నిర్మాణం చేశారని విమర్శించారు. పేదలు నివసించే ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే సీపీఎం, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలతో కూడిన ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ అభ్యర్థి మురళిని గెలిపించాలని హరినాథరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య , రాధాకృష్ణ, ప్రభాకర్‌, శశి, నదియా, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, సహాయ కార్యదర్శి జనార్దన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు శ్రీరాములు, పద్మనాభ రెడ్డి, రామచంద్రయ్య, శివ, వెంకటేష్‌, నవీన్‌, మంజుల, రామక్రిష్ణ, గుర్రప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img