Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఇక్కడ ప్రజల ఆర్తనాదాలు..అక్కడ అసెంబ్లీలో పొగడ్తలు : చంద్రబాబు

వరదల విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రకృతి వైపరిత్యాలు చెప్పిరావని, సమర్థతతో పనిచేయాలని చెప్పారు. సమర్థంగా వ్యవహరించి ఉంటే ప్రాణనష్టం తగ్గేదన్నారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులపై ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌కు గేట్లు పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారన్నారు. మృతదేహం కూడా దొరకలేదంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆగ్రహించారు. ఇలాంటి సమయాల్లో సమర్థమైన ప్రభుత్వం ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయగలిగితే ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గుతాయని చెప్పారు. రాయల చెరవులో ఎప్పుడూ ఇంత నీరు రాలేదు. దాన్ని మేనేజ్‌ చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. పునరావాస చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అసెంబ్లీలో ఆనందపడుతూ పొగిడిరచుకుంటున్నారు. ఇక్కడ ప్రజల ఆర్తనాదాలు..అక్కడ పొగడ్తలు..వరద బాధితులు కుటుంబ సభ్యులను కోల్పోవడంతోపాటు తిండి, నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా సుమారు 40 వేల మందికి సాయమందించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img