Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌..మాస్కులేని వారిని రానిస్తే యాజమాన్యాలకు భారీ జరిమానా

మరోసారి కొవిడ్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో కొవిడ్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను మరోసారి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించవారికి రూ. 100 జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కులేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసివేయించనుంది. నిబంధనల ఉల్లంఘనలపై వాట్సాప్‌ నెం.80109 68295కు తెలపాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img