Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీజేపీకి ఓటమి ఖాయం

ఇండియా కూటమి గెలుపు అనివార్యం
ముప్పాళ్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర`గుంటూరు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఓటమి ఖాయమని, ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికలలోనే కాకుండా 13వ తేదీన జరగబోతున్న నాలుగో విడత ఎన్నికల్లోను అదే రుజువు కాబోతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు మల్లయ్య లింగం భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల మాట్లాడుతూ మోదీ సర్కారు అవలంబిస్తున్న తప్పుడు విధానాల కారణంగా బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. చైతన్యవంతులైన ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు, మేధావులు బీజేపీని ఓడిరచేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టంచేశారు. వైసీపీ, టీడీపీ మోదీకి సాగిలపడటం రాష్ట్ర ప్రజలను బాధిస్తున్నదన్నారు. ఇండియా కూటమి గెలుపు అనివార్యమన్నారు. విభజన రాజకీయాలు చేస్తూ… దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్న మోదీని, ఆయన పొత్తు, తొత్తు పార్టీలను ఓడిరచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు రకరకాల ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తున్నాయని, బహిరంగంగానే కోట్ల రూపాయలు పంపిణీ చేస్తుంటే రెవెన్యూ, పోలీస్‌, ఎన్నికల కమిషన్‌ ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు.ఇండియా కూటమి తరపున గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌కు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్‌లోనూ పోరాడుతా: జంగాల
ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన అజెండా అని, దీనికోసం బయటే కాకుండా పార్లమెంట్‌లోనూ పోరాటం చేస్తానని గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణం వంటి అంశాలపై పార్లమెంట్లో ప్రజాగళం వినిపిస్తానని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, రైతుకు గిట్టుబాటు ధర కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేస్తానన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు ఆకలి చావులు తప్పవని ఆరోపించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ తరపున పోటీలో నిలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇన్నాళ్లు ఏమయ్యారని ప్రశ్నించారు. తనకున్న సామాజిక అవగాహన ఎంత అని నిలదీశారు. అమరావతి ఉద్యమం, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు జరిగిన పోరాటాలలో పెమ్మసాని ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేవలం ధనబలంతో గెలవాలనుకోవడం అత్యాశే అవుతుందని అన్నారు. పెమ్మసానిని ఓడిరచడం అంటే ధన రాజకీయాలను ఓడిరచడమేనని అన్నారు. సమావేశంలో ఇప్టా జాతీయ కార్యదర్శి గని, సీపీఐ నాయకులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్‌ కుమార్‌, జంగాల చైతన్య పాల్గొన్నారు.
జంగాలకు కాపు జేఏసీ మద్దతు
జంగాల అజయ్‌ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్‌ కాపు జేఏసీ మద్దతు తెలియజేసింది. గుంటూరు మల్లయ్య లింగం భవన్‌లో జంగాల అజయ్‌ కుమార్‌ను ఏపీ కాపు జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అమ్మా శ్రీనివాస్‌ నాయుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ మద్దతు తెలియజేసి అజయ్‌ కుమార్‌ను సత్కరించారు. అనంతరం శ్రీనివాస్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి జంగాల అజయ్‌ కుమార్‌ అని అన్నారు. ఇటువంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జంగాల ఎంపీగా గెలిస్తే గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో నెలకొన్న తాగునీరు, రహదారుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కాగా, తనకు మద్దతు తెలిపిన కాపుసంఘం నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img