Friday, May 3, 2024
Friday, May 3, 2024

భారీగా పెరుగుతున్న వరద ఉధృతి

కోనసీమ జిల్లా గోదావరిలో వరద ఉధృతి మరింత ఎక్కువైంది. వరద అంతకంతకూ ఎక్కువకావడంతో నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో సఖినేటిపల్లి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన అప్పనారాముని లంక, కొత్తలంక గ్రామాలకు పడవలపై రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం ముంపు గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం పడవలపై వచ్చిన వారిని తిరిగి వారి గ్రామాలకు వెళ్లేందుకు పడవ ప్రయాణాలకు అధికారులు అనుమతించక పోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరవు అధికారులతో చర్చించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం కోనసీమ జిల్లా మలికిపురం మండలం, దిండిలోని ఏపీ టూరిజం రిసార్ట్స్‌కు వరద తాకింది. టూరిజం రిసార్ట్స్‌కు వరద నీరు చేరుతుండడంతో సిబ్బంది రూముల బుకింగ్‌ రద్దు చేసి, పర్యాటకులను ఖాళీ చేయించారు. వరద ఉధృతి తగ్గే వరకూ టూరిజం రిసార్ట్స్‌లోకి అనుమతి లేదని ఏపీ టూరిజం శాఖ అధికారులు పర్యాటకులకు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img