Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాపట్లజిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు

జిల్లాలో ఆరు స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు 72,736 మెట్రిక్‌ టన్నుల ఇసుక విక్రయానికి సిద్ధం
వ్యక్తికి రోజులో 20 టన్నుల మాత్రమే అనుమతి ఇసుక లోడిరగ్‌ ప్రయాణ ఖర్చులు
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు కలెక్టర్‌ జె.వెంకట మురళి

విశాలాంధ్ర – బాపట్ల : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి ప్రకటించారు. ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉచిత ఇసుక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చి ఇసుక వనరులు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇసుక పాత విధానం లోభిష్ఠంగా ఉందని ప్రభుత్వం గుర్తించి ఇసుక కొరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తెచ్చిందన్నారు. జిసికెఎస్‌ ఏజెన్సీల నుంచి ఇసుక స్టాక్‌ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్‌డివోలు, తహసిల్దార్లను ఆదేశించారు. మండల స్థాయిలో ప్రత్యేక టీములు నియమిస్తామన్నారు. ప్రజలు స్వేచ్చగా ఇసుక తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈనెల 8వ తేదీ సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి ఇసుక వినియోగదారులకు ఉచితంగా ఇవ్వనుందన్నారు. రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడిరగ్‌ ఖర్చు, ప్రయాణ ఖర్చులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల కొరకు మైన్స్‌ అండ్‌ జియాలజీ వెబ్‌ సైట్‌లో పూర్తి వివరాలు ఉంచామన్నారు. వినియోగదారులు తమ ఆధార్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలను చూపి ఇసుక తీసుకోవచ్చన్నారు. జిల్లాలోని ఆరు ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద 72,736 మెట్రిక్‌ టన్నులు ఇసుక విక్రయానికి సిద్ధంగా ఉందని చెప్పారు. వినియోగదారుడి నుంచి డిజిటల్‌ పేమెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకు వెళ్ళడానికి అనుమతిస్తామన్నారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా, భవన నిర్మాణదారులకు భారం లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇసుక నూతన విధానం అమలులోకి వచ్చినందున అక్రమాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నల్ల బజారులో ఇసుక అక్రమ విక్రయాలు అరికట్టాలన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే అధికారులే బాధ్యులన్నారు. ఉచిత ఇసుక విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఇకనుంచి ఇసుక నిరంతరం అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. స్టాక్‌ పాయింట్ల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయం సిబ్బందిలో ఒకరిని స్టాక్‌ పాయింట్ల వద్ద నియమించాలన్నారు. 24 గంటలపాటు పోలీసులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద వాహనాలలోకి లోడిరగ్‌ చేసినందుకు కేవలం రూ.20లు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం బాపట్ల మండలం మార్కెట్‌ యార్డ్‌లోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ లో 15,450 మెట్రిక్‌ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. వేటపాలెం జాతీయ రహదారి వద్ద స్టాక్‌ పాయింట్‌ లో 4,053 మెట్రిక్‌ టన్నుల ఇసుక, అద్దంకి మండలం అనమనమూరు స్టాక్‌ పాయింట్‌ లో 10,374 మెట్రిక్‌ టన్నులు, అద్దంకి తిమ్మాయపాలెం స్టాక్‌ పాయింట్‌ లో 5,103 మెట్రిక్‌ టన్నులు, మార్టూరు స్టాక్‌ పాయింట్‌ లో 2,897 మెట్రిక్‌ టన్నులు, కొల్లూరు మండలం జువ్వలపాలెంలో స్టాక్‌ పాయింట్‌ లో 34,859 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద దస్త్రాలు పక్కాగా ఉండాలని సూచించారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్‌ సత్తిబాబు, గనుల శాఖ ఏడి రాజేష్‌, డిపిఓ సురేష్‌, డిపిఓ రవికుమార్‌, ఆర్డీవోలు, డి.ఎస్‌.పిలు, తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img