Friday, May 31, 2024
Friday, May 31, 2024

అమెజాన్‌ వ్యాపారానికి, మిలిటరీ విధానానికి సారూప్యతలు


బెంగుళూరు: దేశానికి 21 ఏళ్లకు పైగా సేవలు అందించి, విజయవంతమైన కార్యకలాపాలకు మార్గదర్శనం వహించిన తర్వాత, సైన్యంలో అనుభవజ్ఞులైన సుఖ్‌చైన్‌ సింగ్‌ ఏప్రిల్‌ 2020లో, మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో అమెజాన్‌ రవాణా సాంకేతిక బృందంలో చేరారు. ఒక ఏడాదిలోనే సుఖ్‌చైన్‌ వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషించేందుకు అమెజాన్‌ పే బృందానికి వెళ్లారు. ఆయన ప్రస్తుతం అమెజాన్‌లోని ఇండియా పేమెంట్స్‌కు సీనియర్‌ టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ‘ఫేసెస్‌ ఆఫ్‌ అమెజాన్‌’లో భాగంగా ఒక సీనియరుగా అమెజాన్‌లో తన అనుభవం గురించి సుఖ్‌చైన్‌ మాట్లాడుతూ, మనం చేసే పనితో పాటు ప్రాసెస్‌ ఆప్టిమైజేషన్‌, ప్రాసెస్‌ ఉన్న భారత సైన్యం వంటి సంస్థ నుంచి వచ్చానని, అమెజాన్‌లో, తాను కార్పొరేట్‌ ప్రపంచంలోకి సాఫీగా ఇమిడిపోవడాన్ని గుర్తించానని తెలిపారు. తాము అమెజాన్‌లో వ్యాపారాన్ని నిర్వహించే విధానం, మిలిటరీలో నిర్వహించే విధానం మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img