Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చీనీ-నిమ్మ సాగులో విప్లవం

హైదరాబాద్‌ ః భారతదేశంలో చీనీ-నిమ్మ పంటల ఉత్పత్తి సరాసరి 5.24 శాతం వార్షిక వృద్ధి రేటుతో 1970లోని 17.3 లక్షల టన్నులు నుంచి 2019 నాటికి 140 లక్షల టన్నులకు చేరింది. ఉత్పత్తిపరంగా ప్రపంచ వ్యాప్తంగా మూడవ ర్యాంకును ఇండియా సొంతం చేసుకున్నప్పటికీ, చైనా సాధించిన 428 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు బ్రెజిల్‌ సాధించిన 193 లక్షల టన్నుల దిగుబడితో పోలిస్తే ఇక్కడ దిగుబడి స్వల్పమే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు అత్యధికంగా స్వీట్‌ ఆరెంజ్‌ (బత్తాయి) పండిస్తున్నాయి. ఉత్పత్తిపరంగా ఇక్కడ పెను సవాళ్లుగానిలుస్తున్న అంశాలలో ఉత్పాదక వ్యయం పెరగడం, చెట్ల జీవిత కాలం తక్కువగా ఉండటం, పండ్ల నాణ్యత సరిగా లేకపోవడంకు తోడు అసాధారణ మార్కెట్‌ ఒడిదుడుకులు వంటివి ఉంటున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన ఖచ్చితమైన వ్యవసాయ సలహా సంస్థ సంహిత క్రాప్‌ కేర్‌ క్లీనిక్స్‌, తమ అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణులతో కూడిన బృందంతో తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో చీనీ-నిమ్మ సాగుదారులకు తగిన సలహాలను అందిస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు సహాయపడుతుంది. టెలిమెట్రిక్స్‌, డ్రోన్లు, కస్టమైజ్డ్‌ యాప్‌ల సహాయంతో ఈ ప్లాంట్‌ డాక్టర్లు పండ్ల తోటలను పర్యవేక్షిస్తున్నట్లు సంహిత సీఈవో, ఐఐఐటీ హైదరాబాద్‌ పూర్వ ఫ్యాకల్టీ, సీనియర్‌ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం (ఐసీఏఆర్‌) హెడ్‌ డాక్టర్‌ జి.శ్యామసుందర్‌ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img