Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

3 నెలల్లోనే 10 లక్షలకు పైగా స్మార్ట్‌స్పీకర్లను అమర్చిన ఫోన్‌పే

ముంబయి: భారతదేశంలో ముందంజలో ఉన్న ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే కీలక ప్రకటన చేసింది. భారతదేశవ్యాప్తంగా ఉన్న మర్చంట్‌ పార్ట్‌నర్‌లకు 10 లక్షలకు పైగా స్మార్ట్‌స్పీకర్‌లను డిప్లాయ్‌ చేసినట్లు వెల్లడిరచింది. ఈ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చిన 2 నెలల కాలంలోనే 100 కోట్లకు పైగా (1 బిలియన్‌) లావాదేవీలను కంపెనీ ప్రాసెస్‌ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ మర్చంట్‌ పేమెంట్‌ల విషయంలో కంపెనీ తన బలాన్ని చూపించగలిగింది. మర్చంట్‌ ప్రదేశాల్లో అనుకూలమైన పేమెంట్‌ ట్రాకింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ పరికరాలను తీసుకురాగా, వీటి పనితీరు అద్భుతంగా ఉందంటూ మర్చంట్‌లు కంపెనీ తమ ఫీడ్‌బ్యాక్‌ను అందించారు. ఫలితంగా, పట్టణ, గ్రామీణ స్థాయి మార్కెట్‌లలో కూడా కొత్త మర్చంట్‌ పార్ట్‌నర్‌ల నుండి స్మార్ట్‌స్పీకర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. మర్చంట్‌ పార్ట్‌నర్‌లు తమ బిజినెస్‌ను వృద్ధి చేసుకోవడాన్ని సులభతరం చేసేలా కొత్త ఆఫర్‌లను రూపొందించడం, ఎండ్‌-టు-ఎండ్‌ పేమెంట్‌ పరిష్కారాలను అందించడంలో ఫోన్‌పే ఎల్లప్పుడూ ముందంజలో నిలుస్తోంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img