Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఫార్ములా ఇ, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ఎం ఓ యు

హైదరాబాద్‌: – ఫార్ములా ఈ సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ఈరోజు అన్ని ఫార్ములా ఈ రేసులను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ మరియు సోనీ ఎల్‌ఐవి లో భారత ఉపఖండంలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కొత్తగా మూడు సంవత్సరాల మీడియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఎస్పీఎన్‌ఐ ఛాంపియన్‌షిప్‌ పదో సీజన్‌లోని అన్ని రేసులను టెలివిజన్‌లో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానెల్‌లలో ప్రసారం చేస్తుంది. దీని యొక్క ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ సోనీ ఎల్‌ఐవి లో అభిమానులు ఈ సీజన్‌లో అన్ని ప్రాక్టీస్‌ సెషన్‌లను, అలాగే క్వాలిఫైయింగ్‌ మరియు రేసులను ప్రత్యక్ష ప్రసారం చేయగలరు. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఈ జనవరిలో 2024 హాంకూక్‌ మెక్సికో సిటీ ఈ-ప్రిక్స్‌తో ఏబీబీ ఎఫ్‌ ఐ ఏ ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ కవరేజీని ప్రారంభించింది. ఫార్ములా ఈ యొక్క పదవ రేసింగ్‌ సీజన్‌ సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో భారతదేశం అంతటా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది, కవరేజీ ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్తాన్‌ మరియు శ్రీలంకలకు విస్తరించబడుతుంది.
సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఫార్ములా ఈ తో చరిత్రను కలిగి ఉంది, దాని కంటెంట్‌ను నాల్గవ, ఐదవ , ఆరవ సీజన్లలో ప్రసారం చేసిందని సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా, స్పోర్ట్స్‌ బిజినెస్‌ హెడ్‌, డిస్ట్రిబ్యూషన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ చీఫ్‌ రెవిన్యూ ఆఫీసర్‌ రాజేష్‌ కౌల్‌,
ఫార్ములా ఇ చీఫ్‌ మీడియా ఆఫీసర్‌ ఆర్తీ దబాస్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img