Friday, April 19, 2024
Friday, April 19, 2024

శ్యామల్‌ అండ్‌ భూమిక వెడ్డింగ్‌ కలెక్షన్‌ ప్రారంభం

విశాలాంధ్ర/హైదరాబాద్‌: శ్యామల్‌ అండ్‌ భూమిక ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022ను తమ అన్ని స్టోర్ల కంటే ముందు హైదరాబాద్‌ స్టోర్‌లోనే మొదటిసారి ప్రత్యేకంగా ప్రారంభించారు. ప్రముఖ నటి అదితి రావు హైదరి దీన్ని ప్రారంభించారు. ది వెడ్డింగ్‌ కోచర్‌ కలెక్షన్‌ 2022 అనేది ప్రసిద్ది చెందిన ఫ్యాషన్‌ డిజైన్‌ వస్త్రశ్రేణి, ఇవి చేతితో ఎంబ్రాయిడరీ చేయబడిన చిత్రాలు, రంగులతో నిండిన మాస్టర్‌పీస్‌లకు ప్రత్యేకం. పురాతనమైన హస్తకళా నైపుణ్యాలను ఉపయోగించి వీటిని రూపొందించారు. భారత ఉపఖండంకు చెందిన గొప్ప సంస్కృతి మరియు వారసత్వం పట్ల వీరిద్దరికి ఉన్నటువంటి అమితమైన గౌరవం ఈ కలెక్షన్‌లో ప్రకాశిస్తుంది. ఈ కలెక్షన్‌లో కాలిదార్‌ ఘెర్దార్‌ లెహంగాలు, ట్రయిలింగ్‌ హెడ్‌ వాయిల్స్‌, ఫిట్టెడ్‌ చోలీస్‌, డ్రామాటిక్‌ హెమ్‌లైన్‌లు, ఎడ్వర్డియన్‌ స్లీవ్‌లు, సెమీ కన్‌స్ట్రక్టెడ్‌ శారీస్‌, కాలిదార్‌ కుర్తాలు, డ్రేప్‌డ్‌ కౌల్స్‌, స్ట్రెయిట్‌ ఫిట్‌ కమీజ్‌లు, ఫిట్టెడ్‌ చురిడార్‌లు, క్లాసిక్‌ షహరాస్‌లను మెరిసిపోయే ఎంబ్రాయిడరీతో చేసిన బెల్ట్‌లు, క్లచ్‌ బ్యాగులు, బట్వాల వంటి ఆకర్షణీయమైన ఉపకరాణలతో కలిపి అందుబాటులోకి తీసుకువచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img