Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జెఈఈ మెయిన్స్‌లో హైదరాబాద్‌ ఆకాష్‌బైజూస్‌ విద్యార్థుల హవా

విశాలాంధ్ర/హైదరాబాద్‌: ఆకాష్‌ బైజూస్‌ హైదరాబాద్‌లోని పలు కేంద్రాలకు చెందిన 12 మంది విద్యార్ధులు ఇనిస్టిట్యూట్‌కు మాత్రమే కాకుండా నగరానికి సైతం గర్వకారణంగా నిలుస్తూ 99 పర్సంటైల్‌కు పైగా మార్కులను జెఈఈ మెయిన్స్‌ 2022 పరీక్షల మొదటి సెషన్‌లో సాధించారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ సంస్థ వెల్లడిరచింది. ఈ సంవత్సరం ఇంజినీరింగ్‌ కోసం నిర్వహించనున్న రెండు ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో ఇది మొదటిది. టాప్‌ స్కోరర్లలో అశ్రి చెకోటీ 99.8415239, ఆషు జయంతి 99.8125059, అస్మిత్‌ సౌ 99.6332709, అమిత్‌కుమార్‌ పాధి 99.6229986, దివ్యాంష్‌ పాండే 99.6018158, తాడికొండ నాగ సాయి బాలాజీ 99.4968907, గౌతమి బెరెల్లీ 99.295852, వై శరన్‌ శ్రీరామ్‌ రెడ్డి 99.2739233, శ్రీజ గంగుల 99.2143025, నవీన్‌ తన్నీరు 99.1374579బీ గిల్డా ఉద్దవ్‌ నారాయణ్‌ 99.1172మరియు ఆకాష్‌ రెడ్డి కొంతం 99.0211102 ఉన్నారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న ఐఐటీ జెఈఈలో విజయం సాధించేందుకు వీరు ఆకాష్‌ బైజూస్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ కోసం చేరారు.
వరంగల్‌ విద్యార్ధి ఘనత
ఆకాష్‌ బైజూస్‌, వరంగల్‌కు చెందిన విద్యార్థి సాకేత్‌ రెడ్డి 99.07పర్సంటైల్‌కు పైగా మార్కులను జెఈఈ మెయిన్స్‌ 2022 పరీక్షల మొదటి సెషన్‌లో సాధించాడు. సాకేత్‌ రెడ్డి ఆకాష్‌ బైజూస్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ కోసం 2020లో చేరారు. కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోవడంలో తాము పడిన కష్టం, లెర్నింగ్‌ షెడ్యూల్స్‌కు కట్టుబడి ఉండటమే టాప్‌ పర్సంటైల్‌ సాధించిన ఎలైట్‌ జాబితాలో చోటు సంపాదించుకోవడానికి కారణమని ఆకాష్‌ బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img