Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

కాకినాడలో పుష్ప

కాకినాడ : ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ నిమిత్తం శనివారం కాకినాడ వచ్చారు. దీంతో అభిమానులు అల్లు అర్జున్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అభిమానులను చూసి అల్లు అర్జున్‌ కారు డోరు అంచున నిలబడి అభివాదం చేశాడు. ‘పుష్ప’ సినిమా కోసం ఇప్పటికే అనేకసార్లు అల్లు అర్జున్‌ కాకినాడ వచ్చారు. మళ్లీ కొన్ని షెడ్యూల్స్‌ ఉండడంతో కాకినాడ వచ్చారు. రెండు రోజుల పాటు అల్లు అర్జున్‌ కాకినాడ పోర్ట్‌లో జరిగే చిత్రీకరణలో పాల్గొంటారు. ఇటీవల ‘పుష్ప’ సినిమా కోసం ఆయన మీద మారేడుమిల్లి అడవుల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కదానాయిక. మైత్రీమూవీ మేకర్స్‌, ముత్యంశెట్టి మీడియా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో తయారవుతున్న ‘పుష్ప’ పార్ట్‌ 1 ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img