Monday, October 3, 2022
Monday, October 3, 2022

జూనియర్‌ ఎన్టీఆర్‌కు జోడీగా అలియాభట్‌ !

హైదరాబాద్‌ : అగ్ర దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌కు జోడీగా నటిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, త్వరలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్నట్లు తెలిసింది. కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఈమెను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం అలియాభట్‌ను చిత్రబృందం సంప్రదించగా, ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందని, దీంతో క్రేజీ ప్రాజెక్టులో క్రేజీ హీరోయిన్‌ ఎంపికైందని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కాగా, కొరటాల-తారక్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్‌’ వంటి భారీ హిట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img