Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

నాన్నే నా హీరో : నాగార్జున

హైదరాబాద్‌ : తెలుగు సినీ దిగ్గజం, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు జయంతి (1923, సెప్టెంబరు 20) ని పురస్కరించుకుని సోమ వారం ఆయన తనయుడు, ప్రముఖ హీరో నాగార్జున అక్కినేని ఓ వీడియోను విడుదల చేశారు. తద్వారా ఆయనపై తనకున్న అంతులేని ప్రేమను అభిమానులతో పంచుకున్నారు. బంగార్రాజులా మెరిసి పోతూ కనిపించిన నాగార్జున, పొందూరు ఖద్దరు పంచె, నవరత్నాల హారం, నవరత్నాల ఉంగాన్ని ధరించారు. మై హీరో… హై ఇన్స్పిరేషన్‌ అంటూ ఆయన తన తండ్రి గురించి ట్వీట్‌ చేశారు. తన తండ్రి పుట్టినరోజైన సెప్టెంబర్‌ 20వ తేదీ అంటే తనకు చాలా ఇష్టమని నాగార్జున చెప్పారు. నాన్న గారికి పంచెకట్టంటే చాలా ఇష్టమని… ఆయన పంచె కట్టుకున్నప్పుడల్లా ఎంతో ముచ్చటేసేదని అన్నారు. ఆయనకు పొందూరు ఖద్దరంటే చాలా ఇష్టమని… ఇప్పుడు తాను వేసుకున్నది కూడా పొందూరు ఖద్దరేనని తెలిపారు. ఇది నవరత్నాల హారం, ఇది నవరత్నాల ఉంగరం, ఈ వాచ్‌ నాకన్నా సీనియర్‌, ఆయన ఫేవరెట్‌ వాచ్‌ అని చెప్పారు. నా ఫేవరెట్‌ వాచ్‌ కూడా ఇదేనని అన్నారు. ఇవన్నీ వేసుకుంటే నాన్న తన ముందు ఉన్నట్టుందని చెప్పారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్‌ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img