Monday, April 22, 2024
Monday, April 22, 2024

బిగ్‌బాస్‌ సీజన్‌5 ప్రారంభం

హైదరాబాద్‌ : బుల్లితెర ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించేందుకు బిగ్‌ బాస్‌ మళ్లీ వచ్చేసింది. బిగ్‌ బాస్‌ తెలుగు5వ సీజన్‌ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్‌ మాలో హుషారెత్తించే రీతిలో ప్రారంభమైంది. మరోసారిగా హోస్ట్‌ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. వేదికపైకి డిఫరెంట్‌ గెటప్‌ లో వచ్చిన నాగార్జున తొలుత మిస్టర్‌ మజ్నులో పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించారు. ఆపై బిగ్‌ బాస్‌ ను విష్‌ చేసి కార్యక్రమానికి మరింత జోష్‌ తెచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పట్లాగానే ఈసారి కూడా బిగ్‌ బాస్‌ షోలో డ్రామా, రొమాన్స్‌, యాక్షన్‌, ఫన్‌, కొత్త టాస్కులు కనువిందు చేయనున్నాయి. ఇక, నాగార్జున బిగ్‌బాస్‌ హౌస్‌ ను ఆడియన్స్‌ కు పరిచయం చేశారు. గత సీజన్లతో పోలిస్తే ప్రతిదీ కొత్తగా డిజైన్‌ చేశారు. కంటికి ఇంపైన రంగులతో బిగ్‌ బాస్‌ హౌస్‌ ను తీర్చిదిద్దారు. బిగ్‌ బాస్‌ ఇంట్లోని అన్ని లొకేషన్లను నాగ్‌ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img