Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

‘శేఖర్‌ కమ్ముల ముందు ఒప్పుకోలేదు’

హైదరాబాద్‌ : నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ స్టోరీ’ సినిమా పాటలకు విశేష ఆదరణ లభిస్తోన్న సంగతి విదితమే. అలాంటి పాటలను అందిం చిన ఆ సంగీత దర్శకుడి పేరే పవన్‌ సీహెచ్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘మా తాతయ్య .. మా నాన్న ఇద్దరూ కూడా సినిమా టోగ్రఫర్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ నేను మాత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ను కావాలని అనుకునేవాడిని. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని మా పేరెంట్స్‌ సంగీ తాన్ని నేర్పించారు. ఆ తరువాత నా టాలెంట్‌ను గుర్తించి ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రోత్సహించారు. ఆయన టీమ్‌లో కొంతకాలం పనిచేశాను. శేఖర్‌ కమ్ముల సినిమాకు పనిచేయాలని ఉండేది. ‘ఫిదా’ సినిమా సమయంలో ఆయనను కలిశాను.. కానీ ఆయన అప్పుడు అవకాశం ఇవ్వలేదు. ‘లవ్‌ స్టోరీ’ కోసం ‘హే పిల్లా’ పాట చేసి వినిపిస్తే ఆయనకి నచ్చింది. ఆ తరువాత కూడా అనేక టెస్టులు పెట్టిన తరువాతనే ఓకే అన్నారు’’ అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img