Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కొత్త చిత్రం `శ్రీదేవి శోభ‌న్‌బాబు`ను అనౌన్స్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22).. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రోజున‌ గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించ‌నున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. `శ్రీదేవి శోభ‌న్‌బాబు` అనే పేరుతో రూపొంద‌నున్న ఈ క్యూట్ ల‌వ్‌స్టోరిలో యువ క‌థానాయ‌కుడు సంతోశ్ శోభ‌న్, జానులో చిన్న‌నాటి స‌మంత పాత్ర‌లో న‌టించి గౌరి జి.కిష‌న్ ..జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌శాంత్  కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే .. సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ ద‌గ్గ‌ర‌గా నిలుచుకుని క‌ళ్లు మూసుకుని ప్రేమ త‌న్మ‌యత్వంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు క‌నిపిస్తుంది. క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరిగా రూపొందనున్న `శ్రీదేవి శోభ‌న్‌బాబు`తో సుష్మిత కొణిదెల‌తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 
నటీన‌టులు:సంతోశ్ శోభ‌న్‌, గౌరి జి.కిష‌న్ 
సాంకేతిక వ‌ర్గం:బ్యాన‌ర్‌:  గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌నిర్మాతలు:  విష్ణు ప్ర‌సాద్‌, సుష్మిత కొణిదెల‌ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img