Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దానికి వయసుతో సంబంధం లేదు : రష్మిక

ముంబై : శాండల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతోనూ బిజీ అయ్యారు. ‘మిషన్‌ మజ్ను’ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారామె. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి స్పందించారు. వయసులో మీకన్నా చిన్నవారితో డేటింగ్‌ చేస్తారా? అన్న ప్రశ్నకు ‘‘ప్రేమకు వయస్సుతో సంబంధం ఏముంది? ఎదుటి వ్యక్తి మనల్ని మార్చేందుకు ప్రయత్నించనంత వరకూ ఫర్వాలేదు. వయసు అన్నది పెద్ద విషయమేమీ కాదు’’ అని రష్మిక పేర్కొన్నారు. గతంలో కన్నడ హీరో రక్షిత్‌శెట్టితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత పలు కారణాలతో ఆ పెళ్లి ఆగిపోయింది. తాజాగా రష్మిక డేటింగ్‌ గురించి ఇలాంటి కామెంట్స్‌ చేయడం చర్చనీయాశంగా మారింది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో శ్రీవల్లిగా నటిస్తున్నారు రష్మిక. హిందీలో ‘మిషన్‌ మజ్ను’తోపాటు ‘గుడ్‌బై’ చిత్రం కూడా చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img