Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

రానా..తనకి నచ్చినట్టే చేస్తాడు


: సురేష్‌ బాబు

‘ఫ్యూచర్‌ మొత్తం ఓటీటీదే.. త్వరలో సొంతంగా ఓటీటీని స్టార్ట్‌ చేస్తా’ అని చెప్పిన సురేష్‌ బాబు తన బ్యానర్‌ నుంచి వచ్చిన ‘నారప్ప’ సినిమాను నేడు అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. నారప్ప చిత్రం పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాబట్టింది. ఈ సందర్భంలో రానా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానాకి ఇలాంటి సినిమాలే చేయాలని తాను చెప్పనని అన్నారు.‘ఎందుకంటే అతను చెప్పినా వినడు.. తనకి నచ్చినట్టే చేస్తాడు. ప్రతి నిర్ణయం అతని సొంత నిర్ణయమే.. నేను సపోర్ట్‌ చేస్తానంతే.’ అని చెప్పుకొచ్చారు. విరాటపర్వం, దృశ్యం సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ చేయాలంటే.. ఆ సినిమాలకు కూడా పార్టనర్స్‌ ఉన్నారు. ఇప్పుడు వాటిపై ఏమీ చెప్పలేమన్నారు. అయితే విరాటపర్వం సినిమా షూటింగ్‌ 5 రోజులు పెండిరగ్‌ ఉంది. దృశ్యం అయితే షూటింగ్‌ పూర్తయిపోయిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img