Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అంతులేని మోదీ కక్ష

మహారాష్ట్ర నాటకంలో ప్రధాన అంకం ముగిసిన తరవాత బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి ఇప్పుడు బిహార్‌ మీదకు మళ్లింది. సరికొత్తగా ఆడుతున్న ఈ నాటకంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యుల మీద చార్జ్‌ షీట్లు దాఖలు చేస్తున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మళ్లీ బీజేపీతో చేయి కలుపుతారన్న ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ప్రచార బాధ్యతను బీజేపీ నాయకత్వం సుశీల్‌ మోదీకి అప్పగించింది. నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టి అంతా బిహార్‌ మీదే ఉంది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మీద ఆయన బిహార్‌లో పర్యటించినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నితీశ్‌ మళ్లీ తమ సరసన చేరతారన్న ఆశ మోదీకి, అమిత్‌ షాకు ఇప్పటికీ ఉంది. అందుకే రకరకాల పద్ధతుల్లో ఆయన మీద ఒత్తిడి పెంచుతున్నారు. మహారాష్ట్రలో ఏడాది కింద శివసేనను, సోమవారం శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.)ని చీల్చిన తరవాత ఇప్పుడు నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జె.డి.(యు)ను చీల్చే మార్గాలు ఆలోచిస్తున్నారు. ఆ పార్టీలలోని శాసనసభ్యులను నయాన్నో, భయాన్నో తమ వేపు తిప్పుకోవడానికి సకలవిధ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను ‘‘ఆపరేషన్‌ లోటస్‌’’ అంటున్నారు. అయితే రాజకీయంగా సతతం జాగరూకంగా ఉండే నితీశ్‌ కుమార్‌, బీజేపీ తన పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తోందని గ్రహించి తన అనుయాయులు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌.సి.పి. మీద, నితీశ్‌ నాయకత్వంలోని జె.డి.(యు) మీద మోదీ, అమిత్‌ షా కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. అలాగే ఆర్‌.జె.డి. అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను కూడా వేధించడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రత్యర్థులను రుజు మార్గంలో ఎదుర్కోవడం మోదీకి అలవాటే లేదు. లాలూ కుటుంబాన్నంతటినీ ఉద్యోగాల పేర భూములు కబళించారన్న ఆరోపణలతో నిరాధారమైనకేసులు నమోదు చేయిస్తున్నారు. ఎలాగైనా లాలూను, తేజస్వినిని జైలుకు పంపాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో పడి ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడం విజ్ఞత ఉన్న రాజకీయ నాయకులు చేసే పనికాదు. ఆ విజ్ఞత కొరవడి నందువల్లే మోదీ పదే పదే ఆ తప్పు దారిలోనే నడుస్తున్నారు. ఇది తన బలం అన్న భ్రమలో ఉన్నారు. ఏదో ఒక రకంగా ఉన్న, లేని ఆరోపణలు మోపి ప్రత్యర్థి పక్షానికి చెందిన నాయకులను అపఖ్యాతి పాలుచేసి జనాన్ని ఆ పార్టీకి దూరం చేయాలన్నది మోదీ ఎత్తుగడ. జనాదరణ ఉన్న పార్టీలను లొంగ దీయడానికి అనుసరించవలసిన పద్ధతి ఇది కాదు అని మోదీ గ్రహించడం లేదు. ఈ క్రమంలో ఆయన పలుకుబడికే విఘాతం కలుగుతోంది. ఈ ఎత్తుగడలలోని పన్నాగాలను గ్రహించే ప్రజలు కడకు బీజేపీనే ఏవగించుకునే పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు.

మోదీ నడవడిక సంఫ్‌ు పరివార్‌కు సైతం నచ్చడం లేదు. గత మేలోనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధికార పత్రిక ‘‘ఆర్గనైజర్‌’’ మోదీ వైఫల్యాలను ఎండగడ్తూ సంపాదకీయమే రాసింది. ఆయన పలుకుబడి తగ్గుతున్నందుకు ఆందోళన వ్యక్తం చేసింది. 2024 తరవాత అంతా సక్రమంగా ఉండి బీజేపీ విజయం సాధిస్తే మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయగూడదన్న ఆలోచనలు కూడా సంఫ్‌ు పరివార్‌ పెద్దల్లో సాగుతున్నాయన్న వదంతులున్నాయి. అయితే మోదీ పలుకుబడి తగ్గడానికి కారణం ఏమిటో మాత్రం ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకీయంలో వెల్లడిరచలేదు. మోదీ పలుకుబడి తగ్గడానికి కారణం ఏమిటో సంఫ్‌ు పరివార్‌కు తెలియదనుకోలేం. సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను అమలు చేయడానికి మోదీ అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్వేష రాజకీయాలను తారస్థాయికి తీసుకెళ్లారు. మోదీ అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక రాజకీయాలు మోదీ పలుకుబడిని బాగా దెబ్బతీశాయి. ఒక రకంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకత్వానికి కూడా అందనంత దూరం మోదీ వెళ్లిపోయారు. నిఖార్సైన నియంతలా వ్యవహరించే వారి చుట్టూ భక్తులే ఉంటారు తప్ప నిష్ఠుర సత్యం చెప్పడానికి సాహసించేవారు ఎవరూ ఉండరు. అందుకే నియంతలకు క్రమంగా ప్రజలతో సంబంధాలు లేకుండా పోతాయి. చప్పట్లు కొట్టే జనం మాత్రమే కనిపిస్తారు. ఈ వాతావరణం నియంతలను మరింత కరుడుగట్టేలా తయారు చేస్తుంది. మోదీ ప్రస్తుతం ఈ దశలోనే ఉన్నారు. అందుకే కసి తీర్చుకునే క్రమంలో ఎటు వెళ్తున్నామో కూడా గమనించే స్థితిలో లేరు. స్థిరాస్తులిస్తే ఉద్యోగాలు అన్న కుంభకోణంలో సీబీఐ సోమవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇది తేజస్వీ మీద రెండో చార్జ్‌ షీట్‌. లాలూ మీద, మరో ముగ్గురి మీద కొత్త చార్జ్‌ షీట్లు దాఖలయ్యే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రాబ్డీ దేవి, కూతురు మీసా భారతి మీద ఇదివరకే చార్జ్‌ షీట్లు దాఖలు చేశారు. ఆ కేసులో వారికి న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. మొట్ట మొదటి చార్జ్‌షీట్లో తేజస్వీ యాదవ్‌ పేరు లేదు. నిజానికి కుంభకోణం జరిగిందంటున్న సమయంలో తేజస్వీ బడికెళ్లే కుర్రాడు. ఇప్పుడు ఆయన ప్రభావవంతమైన రాజకీయ నాయకుడై పోయారు కనక పనిలో పనిగా రెండవ చార్జ్‌ షీట్లో ఆయన పేరు చేర్చేశారు. ఇవన్నీ మోదీ, అమిత్‌ షాకు తెలియకుండా జరుగుతున్నాయనుకోవడానికి వీల్లేదు. ఈ ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ దిల్లీలోని తేజస్వీ ఇంట్లో సోదా చేసింది.
బిహార్‌తో పాటు అనేక నగరాల్లో తేజస్వీకి సంబంధం ఉన్న చోట్లపై దాడులు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌, సీబీఐ తేజస్వీ మీద మోపిన కొన్ని ఆరోపణలు గురి తప్పాయి. గుర్గావ్‌లో ఒక హోటల్లో తేజస్వీకి వాటా ఉందన్నారు. తీరా చూస్తే ఆ హోటల్‌ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సన్నిహిత అనుచరుడిదని తేలింది. ప్రత్యర్థులను అపఖ్యాతి పాలుచేసి, తాము కడిగిన ముత్యంలాంటి వాళ్లమని నిరూపించుకోవడానికి చేసే హడావుడిలో ఆరోపణలు గుప్పిస్తే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. తొక్కిన అడుసు కడుక్కోవడం కష్టం అవుతుంది. 2024లో ఓటమి తప్పదన్న భయం మోదీ, అమిత్‌ షాను విపరీతంగా పీడిస్తోంది. అందుకని వెనకా ముందు చూసుకోకుండా అవినీతి ఆరోపణలు మోపుతున్నారు. చివరకు తామే బోర్లా పడుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి సరైన దారి అన్వేషించకుండా అడ్డదార్లు తొక్కితే ఇలాంటి భంగపాటే ఎదురవుతుంది. కానీ తార్కికంగా ఆలోచించే అలవాటు మోదీకి లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img