Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మదర్సాల రద్దుకు ‘‘సుప్రీం’’ బ్రేకు

సైనిక పాఠశాలలకు కాషాయ రంగు పులుముతున్న బీజేపీ మదర్సాల మీద మాత్రం కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తోంది. కాషాయాంబరధారి అయిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మదర్సాల విషయంలో మీరిన వ్యతిరేకవైఖరి అనుసరిస్తున్నారు. 2004 నాటి మదర్సా విద్యా చట్టాన్ని రద్దు చేశారు. అలహాబాద్‌ హైకోర్టు ఈ రద్దుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మదర్సాలపట్ల విద్వేషానికి సుప్రీంకోర్టులో అడ్డుపడిరది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెల్లదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచి అలహాబాద్‌ హైకోర్టు తీర్పు అమలు మీద స్టే విధించింది. మదర్సాలను నిషేధించాలన్న యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ పథకం అమలై ఉంటే వీటిలో చదువుకుంటున్న 17లక్షల మంది విద్యాభ్యాసానికి గండిపడి ఉండేది. పైగా భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద నిలబెట్టేవారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మదర్సాలు 2004 నాటి మదర్సా బోర్డు చట్టం ప్రకారం విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును రద్దు చేయడానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ……గత నెల అలహాబాద్‌ హైకోర్టు మాత్రం 2004 నాటి మదర్సాల బోర్డు చట్టం ‘‘రాజ్యాంగ విరుద్ధమైంది’’ అని ప్రకటించింది. ఈ చట్టం సెక్యులర్‌ సూత్రాలను ఉల్లంఘిస్తోందని తేల్చి మదర్సాలలో చదువుకుంటున్న వారిని మామూలు విద్యా వ్యవస్థలో భాగస్వాములను చేయాలని ఆదేశించింది. అయితే శుక్రవారం సుప్రీంకోర్టు ఇంతకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులో మదర్సాల బోర్డు చట్టం నియంత్రించడానికి ఉద్దేశించిందే తప్ప ఆ బోర్డు ఏర్పాటే సెక్యులరిజాన్ని వమ్ము చేస్తుందనడం సరైన ధోరణి కాదని పేర్కొంది. మదర్సాలు కేవలం మతపరమైన అంశాలు బోధించే కేంద్రాలు కాదని కూడా వ్యాఖ్యానించింది. మదర్సా బోర్డు చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పినప్పుడు అలహాబాద్‌ హైకోర్టు మదర్సాలలో చదువుతున్న 17 లక్షల మంది విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించాలని సూచించింది. అయితే వీరిని ఇతర పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అయిదు అర్జీలు దాఖలైనాయి. మదర్సాల విషయంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశం మదర్సాలలో సెక్యులర్‌ విద్యా విధానం ఉండాలని, లెక్కలు, సైన్సు, చరిత్ర, వివిధ భాషలు నేర్పే అవకాశం ఉండాలన్నదే. అయితే దానికి పరిష్కారం 2004 నాటి చట్టాన్ని రద్దు చేయడమే విరుగుడు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.
విచిత్రం ఏమిటంటే సెక్యులర్‌ భావాలను అడుగడుగునా అణగదొక్కుతున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సమర్థించాయి. మదర్సాలలో జరిగే మతపరమైన అంశాల బోధనపై చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. మదర్సాల తరఫున వాదించిన ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది మతపరమైన విద్య అంటే మత బోధన కాదని గుర్తుచేశారు. అలహాబాద్‌ హైకోర్టు తీసుకున్న నిర్ణయంవల్ల మదర్సాలలో పనిచేస్తున్న పది వేలమంది ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోతారని 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని సింఫ్వీు వాదించారు. అయితే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వాదించింది. 2004 నాటి మదర్సా బోర్డు చట్టం రాజ్యాంగ విరుద్ధమైందని హైకోర్టు మార్చి 22న తీర్పు చెప్పింది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మదర్సాలు కూడా రాజ్యాంగ విరుద్ధమేనని హైకోర్టు అభిప్రాయపడిరది. అలహాబాద్‌ హైకోర్టు ఈ చట్టంలోని అంశాలను సరైన దృక్పధంతో చూసినట్టు లేదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2004 నాటి మదర్సాల చట్టం ‘‘రాజ్యాంగ విరుద్ధమైంది’’ అని తేల్చిన అలహాబాద్‌ హైకోర్టు విచిత్రంగా ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగ మౌలిక చట్రానికి విరుద్ధమైనవి అని కూడా అభిప్రాయపడిరది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ దృక్పథానికి అతికినట్టు సరిపోతుంది. దీన్నిబట్టి కొన్ని రాష్ట్రాల హైకోర్టులు బీజేపీ భావజాలానికి అనుకూలమైన తీర్పులు చెప్తున్నాయన్న వాదనకు మరింత బలం చేకూరింది. హైకోర్టు చెప్పిన తీర్పు అమలుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు మదర్సాల బోర్డు చట్టం కేవలం వీటి నియంత్రణకు ఉపకరించేది అని తేల్చి చెప్పింది. మదర్సాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనుకుంటే అసలు మదర్సాల బోర్డు చట్టమే రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పడం సరైన విధానం కాదని సుప్రీంకోర్టు ఈ చట్టం చెల్లదన్న వాదనలోని అంతస్సారాన్ని, అది ఏ పక్షం వాదన అన్న విషయాన్ని చక్కగా అంచనా వేసింది. అందరికీ నాణ్యమైన విద్య అందాలనడంలో రాష్ట్రం ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టేనని సుప్రీంకోర్టు భావించింది. అదే సమయంలో హైకోర్టు ఈ చట్టాన్ని సమగ్రంగా తూకం వేయలేదని కూడా నిర్మోహమాటంగా తెలియజేసింది. వివిధ మతాల వారికీ ప్రత్యేక విద్యా సంస్థలున్నాయి. క్రైస్తవులు మిషనరీ పాఠశాలలు నడుపుతుంటారు. హిందూమతం వారు ప్రత్యేకంగా నిర్వహించే పాఠశాలలు ఏమీ లేవన్న మాట వాస్తవమే. కానీ హిందూ మతోద్ధరణకు కంకణం కట్టుకున్న సంఫ్‌ు పరివార్‌ నిర్వహించే సరస్వతీ విద్యా మందిరాలు, శిశు మందిరాలు హిందూ మతం గురించి బోధించకుండా మానడం లేదు. అయితే ఒక్క మదర్సాల దగ్గరకు వచ్చేటప్పటికి అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. గత పదేళ్ల కాలంలో ఈ ఆలోచనా ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. తాముచేసే పనే ఇతర మతాలవారు చేస్తే సంఫ్‌ు పరివార్‌ బొత్తిగా భరించలేదు. ముఖ్యంగా మదర్సాలపై సంఫ్‌ు పరివార్‌తో సహా కొన్ని వర్గాల వారి వాదనలు విపరీతంగా ఉంటాయి. ఇలాంటి వర్గాలు సెక్యులరిజం గురించి మాట్లాడడం విపరీత వైఖరిలా కనిపించక మానదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img