Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పడినప్పుడల్లా లేచే కెరటం

బీజేపీ ప్రోత్సాహంతో అజిత్‌పవార్‌ తిరుగుబాటు చేసినందు వల్ల నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.) కురువృద్ధుడు శరద్‌ పవార్‌ సంకట స్థితిలో పడ్డట్టు కనిపిస్తోంది. శరద్‌ పవార్‌ సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ ఎప్పటి నుంచో అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారమే ఆయనకు సర్వస్వం అయిపోయింది. ఆదివారం ఆయన షిండే నాయకత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి కూడా మంత్రి పదవులు దక్కాయి. రేపో మాపో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగితే ఇంతకాలం శరద్‌ పవార్‌ కు కుడిబుజంలా మెలిగిన ప్రఫుల్‌ పటేల్‌ కు కూడా చిన్నదో పెద్దదో మంత్రి పదవి దక్కొచ్చు. ఛగన్‌ భుజబల్‌ కూడా ఏదో ఆశిస్తున్నారు. వీరిద్దరూ ఇప్పుడు అజిత్‌పవార్‌ మద్దతుదార్లుగా మారారు. అజిత్‌ పవార్‌ ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రి అయిన సందర్భాలు నాలుగో అయిదో ఉన్నాయి. కానీ ఏ సందర్భంలోనూ ఎక్కువ కాలం ఆయన ఆ పదవిలో లేరు. అయినా అజిత్‌ పవార్‌ కు ఆశమాత్రం పోలేదు. ఎప్పుడో ఒకప్పుడు తాను ముఖ్యమంత్రిని అవుతానంటున్నారు. తమదే అసలైన ఎన్‌.సి.పి. అని ఆయన వాదిస్తున్నారు. దీనికి చిన్న ఆధారం లేకపోలేదు. బుధవారం ఎన్‌.సి.పి. లోని రెండు వర్గాలూ తమకు మద్దతిస్తున్న శాసనసభ్యుల సమావేశాలు ఏర్పాటు చేశాయి. అజిత్‌ వర్గం ఏర్పాటు చేసిన సమావేశానికి 29 మంది హాజరయ్యారు. అయినా ఆయన తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్నారు. శరద్‌ పవార్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి 17 మందే హాజరయ్యారంటున్నారు. ఎన్‌.సి.పి.కి మొన్నటి దాకా 53 మంది సభ్యులు ఉండేవారు. మరి మిగతావారు ఏ శిబిరంలో ఉన్నారో తెలియదు. రెండు శిబిరాలాలలోనూ కనిపించని వారు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించ వచ్చు. కొందరు శాసనసభ్యులు రెండు సమావేశాలకూ హాజరయ్యారట. తాను ఏర్పాటు చేసిన సమావేశానికి నికరంగా ఎంతమంది హాజరయ్యారో శరద్‌ పవార్‌ చెప్పలేదు. అజిత్‌ పవార్‌ మాత్రం తనకే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనక ఎన్‌.సి.పి. తమదేనంటున్నారు. తాను తిరుగుబాటు చేయడానికి మూడు రోజుల ముందే తనను ఎన్‌.సి.పి. అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని కూడా ఇప్పుడు చెప్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి ఈ మాట చెప్పకపోవడంలోని ఆంతర్యం ఏమిటో తెలియదు. అనుభవజ్ఞుడైన శరద్‌ పవార్‌ నాయకత్వం మీద విశ్వాసం ఉంచాలని ఆయన కూతురు, ఇటీవలే కార్య నిర్వాహక అధ్యక్షురాలైన సుప్రియా సూలే విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని అజిత్‌ పవార్‌ వర్గం కోరుతోంది. శరద్‌ పవార్‌కు అండగా నిలబడాలనీ, అజిత్‌ పవార్‌కు మద్దతివ్వాలని రెండు వర్గాలు ముంబైలో పోస్టర్లు అంటించాయి. ఒంటరి పోరాటం చేస్తున్న వీరుడిని సమర్థించాలని శరద్‌ పవార్‌ ఇంటి ముందు బ్యానర్లు వెలిశాయి. విచిత్రం ఏమిటంటే అజిత్‌ పవార్‌ వర్గం తాము తిరుగుబాటు చేసినా శరద్‌ పవార్‌ ఫొటోలు వినియోగించుకోకుండా బ్యానర్లు, పోస్టర్లు వేయలేక పోయింది. చీలి పోయిన అజిత్‌వర్గం శరద్‌ ఫొటోల కోసం వెంపర్లాడడం ఎన్‌.సి.పి.లో ఆ కురువృద్ధుడి అనివార్యతను రుజువు చేస్తోంది.

అజిత్‌ పవార్‌కు మద్దతిచ్చే వారిని అనర్హులుగా ప్రకటించాలని శరద్‌ వర్గం శాసనసభ స్పీకర్‌కు అర్జీ పెట్టుకుంది. అజిత్‌ పవార్‌ వర్గానికి ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా వారిని అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంటుంది. చట్టసభల్లో ఇండిపెండెంట్లు ఉండవచ్చు కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధంలేని శాసనసభాపక్షం ఉండడానికి వీలులేదు. షిండే వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం ఈ మాటే చెప్పింది. అంటే అజిత్‌ పవార్‌ తనకు ఎంతమంది మద్దతు ఉందని ప్రకటించినా వారందరినీ అనర్హులుగా ప్రకటించాలని కోరడానికి శరద్‌ పవార్‌ వర్గానికి అవకాశం ఉంటుంది. ఆ విజ్ఞప్తిని పరిశీలించనూ వచ్చు. అజిత్‌ వర్గానికి మద్దతిచ్చే శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, ఎంపీల సంఖ్య ఎంత అని నికరంగా తేలేదాకా ఏది అసలైన ఎన్‌.సి.పి.నో స్పష్టం కాదు. కానీ న్యాయపరమైన చిక్కులను నివారించడానికే అజిత్‌ వర్గం శరద్‌ పవార్‌ను అధ్యక్ష స్థానం నుంచి తొలగించినట్టుంది. జూన్‌ 30న అజిత్‌పవార్‌ను ఎన్‌.సి.పి. అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి మొత్తం 40 మంది తాము అజిత్‌ పవార్‌ ను సమర్థిస్తున్నామని ప్రమాణ పత్రాలు దాఖలు చేశారని ఎన్నికల కమిషన్‌ వర్గాలు చెప్పాయి. 83ఏళ్ల వయసున్న శరద్‌పవార్‌ ఇంకా పెత్తనం చేలాయించడం ఏమిటి అని అజిత్‌పవార్‌ ప్రశ్నించడం ఆయన సంస్కారానికి సంబంధించిన అంశం. శివసేనతో కలిసి మహా వికాస్‌ అగాఢీ ఏర్పాటు చేసినప్పుడు బీజేపీతో కలిస్తేనేం అని అజిత్‌ పవార్‌ వాదిస్తున్నారు. అజిత్‌ పవార్‌ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ శరద్‌పవార్‌ గట్టి సమాధానాలిచ్చి ఆరోపణలను పరాస్తం చేశారు. నాగాలాండ్‌లో బీజేపీని సమర్థించడానికి కారణం ఏమిటో కూడా చెప్పారు. బీజేపీతో చేయి కలిపిన అకాలీ దళ్‌ లాంటివి ఇప్పుడు అధికారంలో లేవని శరద్‌ పవార్‌ గుర్తు చేశారు. నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు కనక నిలబడగలిగారన్నారు. శివసేనకూడా హిందుత్వవిధానాలే అను సరించినా మిగతా వారిని కూడా కలుపుకు పోతుంది తప్ప బీజేపీలా జనాన్ని చీల్చదని అన్నారు. కులం, మతం ఆధారంగా ప్రజలను చీల్చే వారికి దేశం మీద ప్రేమ ఉండదని శరద్‌ పవార్‌ అన్న మాటల్నిబట్టి చూస్తే ఆయన సెక్యులర్‌ విధానాలను విడనాడలేదని అర్థమవుతోంది. శరద్‌పవార్‌కు తిరుగుబాట్లు కొత్త కాదు. గతంలో ఇలాగే తిరుగుబాటు జరిగినప్పుడు మొత్తం 68మంది ఎమ్మెల్యే లలో 62మంది శరద్‌పవార్‌కు దూరమయ్యారు. ఆ తరవాతజరిగిన ఎన్నికలలో ఆ 62 మందిలో నలుగురు మాత్రమే గెలిచారు. పవార్‌ నిలబెట్టినవారు అధిక సంఖ్యలో విజయం సాధించారు. దుష్పరిపాలనకు ప్రతీకగా తయారైన బీజేపీతో కలిసే ప్రసక్తిలేదని నిర్మొహమాటంగా చెప్పారు. ఎన్‌.సి.పి.కి పూర్వ వైభవం తీసుకురాగలనన్న ఆత్మవిశ్వాసం ఆయనలో తొణికిసలాడుతోంది. ఆ పని ఇంతకుముందు చేసిన అనుభవమూ దండిగానే ఉంది. భిన్నమైన ఎన్నికల చిహ్నాలు ఎన్నడూ శరద్‌ పవార్‌ విజయానికి అడ్డంకి కాలేదు. ఇందిరా గాంధీ లాంటి వారినే ఎదిరించి నిలదొక్కుకున్న తిరుగులేని రాజకీయ చాతుర్యం ఉన్న శరద్‌ పవార్‌ అంత సులభంగా పోరాటం నుంచి వెనుకడుగు వేస్తారనుకోవడం భ్రమ. ఆయన ప్రస్తుతం కచ్చితమైన సెక్యులర్‌ విధానాలకు కట్టుబడి ఉన్నారు కనక విద్వేష రాజకీయాలు అనుసరించే బీజేపీ పాచికలు ఎల్లవేళలా పారకపోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img