Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాయ్‌బరేలీపై నిరర్ధక రచ్చ

రాహుల్‌ గాంధీని ఉత్తరప్రదేశ్‌ లోనిఅమేథీÄ నుంచి పోటీ చేయించాలని బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. ఒక వేళ 2019లో లాగా రాహుల్‌ గాంధీ అమేథీÄ నుంచి మళ్లీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోతే ఆనందించవచ్చునని అత్యాశకు పోయింది. 2019 ఎన్నికలలో రాహుల్‌ తన కుటుంబానికి కంచుకోట లాంటి అమేథీÄ నుంచే కాక వాయనాడ్‌ నుంచి కూడా పోటీచేసి వాయనాడ్‌ లో గెలిచి అమేథీÄÄలో స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో ఓడిపొయారు. ఇది బీజేపీకి అత్యంత అనుకూలమైన అంశం. కానీ చివరి నిముషం దాకా అమేఠీ నుంచి రాహుల్‌ పోటీ చేస్తారా లేదా అన్న ఊహగానాలకు కావలసినంత అవకాశం ఇచ్చి చివరకు రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ నిర్ణయించుకున్నారు. ఇందిరా గాంధీ హయాం నుంచి ఈ రెండు లోకసభ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ వచ్చాయి. ఇందిరా గాంధీ రాయబరేలీకే ప్రాతినిధ్యం వహించేవారు. 1977 ఎన్నికలలో మాత్రం ఆమె సోషలిస్టు పార్టీ నాయకుడు రాజ్‌ నారాయణ్‌ చేతిలో ఓడి పోయారు. 1967, 1971లో ఇందిరా గాంధీ రాయ్‌ బరేలీకే ప్రాతినిధ్యం వహించారు. 1977లో ఓడిపోయినా 1980లో మళ్లీ అక్కడినుంచే గెలిచారు. 1984, 1996లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులుగా అరుణ్‌ నెహ్రూ, షీలా దీక్షిత్‌ విజయం సాధించారు. 2004, 2009లో సోనియా గాధీ గెలిచింది ఇక్కడే. ఇందిరా గాంధీ భర్త ఫెరోజ్‌ గాంధీ 1952, 1957లో రాయ్‌ బరేలీ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రాహుల్‌ గాంధీ రెండో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అమేథీÄÄని కాకుండా రాయబరేలీని ఎంపిక చేసుకోవడం వెనక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు రాహుల్‌ అమేఠీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్‌ పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆశించారు. రాహుల్‌ అమేథీÄÄ నుంచి పోటీ చేయడం స్మృతి ఇరానీతో తలపడడం కాదని అది నేరుగా మోదీని ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వారి భావన. ఇటీవలి కాలంలో మోదీ అనుమానాలకు తావు లేకుండా రాహుల్‌ నే తన అసలు ప్రత్యర్థిగా భావిస్తున్నారు. అయితే అమేఠీ నుంచి కాంగ్రెస్‌ రంగంలోకి దింపిన కిశోరీలాల్‌ శర్మ కాంగ్రెస్‌ అగ్రనాయకులకు అత్యంత సన్నిహితుడు. అమేథీÄÄలో సోనియా గాంధీ కుటుంబం తరఫున ఆ నియోజక వర్గ బాధ్యతలను ఆయనే చూసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌ కార్యకర్తగా ఆయనకు అమేథీÄÄ నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వడం సబబే. అయితే అమేథీÄÄలో గత కొంత కాలంగా భారీ మార్పులు వచ్చాయి. అయినా అమేథీÄÄ నియోజక వర్గం గురించి కిశోరీ లాల్‌ శర్మకు అణవణువూ తెలుసు. ఆయన స్థానికుడు కావడం కూడా మరో సానుకూల అంశం. రాహుల్‌ రాయబరేలి నుంచి పోటీ చేయడం అక్కడ తమకు ఇంతవరకు ఉన్న పట్టును పదిలపరచుకోవచ్చునన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌ కు ఉండి ఉండవచ్చు.
కాంగ్రెస్‌ ది వంశపారంపర్య పాలన అని అనునిత్యం దెప్పి పొడిచే బీజేపీ చివరకు భంగ పడవలసి వచ్చింది. ప్రియాంకా గాంధీ ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించడం బీజేపీ కుటిల ఊహలకు అవకాశం లేకుండా పోయింది. ఈ సారి ఎన్నికలలో ప్రియాంకా గాంధీ, రాహుల్‌ గాంధీలో ఒకరే పోటీ చేయాలన్న సంకల్పం ముందు ఉంది. ముందునుంచే ఈ ఎన్నికలలో రాబర్ట్‌ వాడ్రా కూడా రంగంలో దిగడానికి సిద్ధమయ్యారు. ప్రియాంకా గాంధీ విపరీతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమె కనీసం రెండు మూడు సభలలో పాల్గొంటున్నారు. రాహుల్‌, ప్రియాంక ఇద్దరూ పోటీచేసి ఉంటే అవి తమ గౌరవానికి సంబంధించినవి కనక వాటిలో విజయం ప్రతిష్ఠకు సంబంధించిన అంశం అవుతుంది. కనక ఇద్దరిలో ఒకరే పోటీ చేయాలనుకున్నారు. లేకపోతే ఆ ఇద్దరూ తమ నియోజక వర్గాలలో గెలుపు మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వచ్చేది. మిగతా చోట్ల ప్రచారానికి ఆట్టే సమయం కేటాయించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రియాంక సైతం వివిధ నియోజక వర్గాలలో ప్రచార బాధ్యత తీసుకోవచ్చు. రాహుల్‌ గాంధీ సైతం రాయ్‌ బరేలీకి మూడు నాలుగు సార్లయ్లినా వెళ్లక తప్పక పోవచ్చు. రాయ్‌బరేలీ, అమేథీÄ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరో చెప్పకుండా కాంగ్రెస్‌ జాప్యం చేయడం వెనక ఇదే వ్యూహం ప్రధానమైంది. సోనియా ఇటీవలే రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. సోనియా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనకుండా రాజ్యసభకు వెళ్లడం కూడా బీజేపీకి అభ్యంతరకరమైంది. రాహుల్‌ చివరిదాకా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పకపోవడం, సోనియా రాజ్యసభకు వెళ్లడాన్ని కూడా పెద్ద ప్రచారాస్త్రం చేశారు. మళ్లీ ఈ సారి గెలవలేనన్న భయంతో సోనియా రాజ్యసభను ఆశ్రయించారని దుమారం రేపారు. ఇప్పుడు రాహుల్‌ రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేయడం కూడా బీజేపీకి అభ్యంతరకరం అయింది. ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయడాన్ని కూడా బీజేపీ తప్పుపడ్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ నుంచే కాక వారణాసి నుంచి ఎందుకు పోటీ చేశారు అన్న ప్రశ్నకు మాత్రం వారి దగ్గర సమాధానం లేదు. ఎక్కడ ఎవరు పోటీచేసినా, కొంతమంది రెండేసి సీట్ల నుంచి పోటీ చేసినా విజయం ఎవరిని వరిస్తుంది అన్నది జూన్‌ నాలుగున గానీ తేలదు. ఇంతకు ముందు రాహుల్‌ గాంధీని రోజూ అవహేళన చేసేవారు. రాహుల్‌ రాజకీయాల్లో రాటు దేలడం మోదీ గుండెల్లో భయం పెరుగుతోంది. క్రమంగా రాహుల్‌ తనకు బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఎదగడం మోదీకి ఇబ్బందికరంగా తయారైంది. అందుకే రాహుల్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్న అంశాన్ని కూడా సంకుచిత రాజకీయ రచ్చ కింద మారుస్తున్నారు. కాంగ్రెస్‌ను నిరంతరం ఆదరిస్తూ వచ్చిన రాయ్‌ బరేలీని కాపాడుకోవడం, అమేథీÄలో 2019లో రాహుల్‌ ఓడి పోయింది కేవలం 55 వేల ఓట్ల తేడాతోనే. డాదాపు ఇరవై లక్ష ఓటర్లున్న చోట ఈ లోటు భర్తీ చేయడానికి వీలులేనిది ఏమీ కాదు. బీజేపీ గుర్తించ వలసింది ఇది వ్యక్తుల మధ్యో, ఉభయ పక్షాల నేతల మధ్యో పోటీ కాదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలన్నీ దీక్షా బద్ధమై ప్రయత్నిస్తున్న ఎన్నికలు ఇవి. ఇప్పుడు మోదీని ఓడిరచకపోతే భవిష్యత్తులో ఎన్నికలే ఉండబోవేమోనన్న భయాందోళనలు నిరాధారమైనవి కావు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img