Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆకలి ‘ఆందోళనకరం’

ప్రపంచ ఆకలి సూచిలో 101వ స్థానానికి దిగజారిన భారత్‌
పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కంటే దారుణం
చర్యలు చేపట్టకుంటే అది ‘ఎవరినీ వదిలిపెట్టదు’
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్న వాస్తవం మరోసారి రుజువయ్యింది. 116 దేశాల గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జీహెచ్‌ఐ)2021లో భారతదేశం 101వ స్థానానికి దిగజారింది. గత ఏడాది 94వ స్థానం నుండి పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే దారుణ స్థితికి పడిపోయింది. కాగా చైనా, బ్రెజిల్‌, కువైట్‌ సహా 18 దేశాలు ఐదుకన్నా తక్కువ జీహెచ్‌ఐ స్కోరుతో అగ్రస్థానాన్ని పంచుకున్నాయని ఆకలి, పోషకాహార లోపాన్ని గుర్తించే ప్రపంచ ఆకలి సూచి వెబ్‌సైట్‌ గురువారం తెలిపింది. ఐరిష్‌ సహాయ సంస్థ కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్‌, జర్మనీ సంస్థ వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక.. భారతదేశంలో ఆకలి స్థాయిని ‘ఆందోళనకరంగా’ పేర్కొంది. 2020లో 107 దేశాలలో భారతదేశం 94వ స్థానంలో ఉంది. ఇప్పుడు 116 దేశాలు పోటీలో ఉండగా అది 101వ ర్యాంకుకు పడిపోయింది. భారతదేశం జీహెచ్‌ఐ స్కోరు 2000 సంవత్సరంలో 38.8 నుండి 20122021 మధ్య 28.827.5 స్థాయికి క్షీణించింది. జీహెచ్‌ఐ స్కోరు నాలుగు సూచికలపై లెక్కించబడుతుంది. పోషకాహార లోపం, చైల్డ్‌ వేస్టింగ్‌ (తీవ్రమైన పోషకాహార లోపాన్ని ప్రతిబింబిస్తూ, వారి ఎత్తుకంటే తక్కువ బరువు ఉన్న ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల వాటా), చైల్డ్‌ స్టంటింగ్‌(ఐదేళ్లలోపు పిల్లలు వారి వయస్సులో తక్కువ ఎత్తు, దీర్ఘకాలిక పోషకాహార లోపం ప్రతిబింబిస్తుంది), పిల్లల మరణాలు (ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు). భారతదేశంలో పిల్లల్లో క్షీణత వాటా 1998-2002 మధ్య 17.1 శాతం నుండి 2016-2020 మధ్య 17.3 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ‘కోవిడ్‌19 మహమ్మారి ఆంక్షల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు ఉన్న దేశం భారత్‌’ అని వివరించింది. పొరుగు దేశాలు నేపాల్‌(76), బంగ్లాదేశ్‌(76), మైన్మార్‌(71), పాకిస్తాన్‌(92) లు కూడా ‘ఆందోళనకర ఆకలి’ విభాగంలో ఉన్నాయి. కానీ భారత్‌ కంటే తమ పౌరులకు ఆహారాన్ని అందించడంలో మెరుగ్గా ఉన్నాయి. ఇదిలాఉండగా, భారత్‌ కన్నా దారుణ స్థితిలో పపువా న్యూగునియా(102), అఫ్గానిస్థాన్‌(103), నైజీరియా(103), కాంగో(105), మొజాంబిక్‌(106), సియోర్రా లినే(106), తైమూర్‌లెస్తే(108), హైతీ(109), లైబీరియా(110), మడగాస్కర్‌(111), డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో(112), చాద్‌(113) సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌(114), యెమెన్‌(115), సోమాలియా(116) ఉన్నాయి. ఏదేమైనా, భారతదేశం ఇతర సూచికలలో అండర్‌-5 మరణాల రేటు, పిల్లలలో స్టంటింగ్‌, సరిపడా ఆహారం కారణంగా పోషకాహార లోపం వంటి ఇతర సూచికలలో మెరుగుదల చూపించినట్లు తెలిపింది. అయితే అనేక అంశాలలో ఆహార భద్రత దాడి చేయబడుతోంది. ఘర్షణలు, ప్రపంచ వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వాతావరణ తీవ్రతలు, కోవిడ్‌19 మహమ్మారికి సంబంధించిన ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు అన్నీ ఆకలి మంటలు రేపుతున్నాయి. ‘ప్రాంతాలు, దేశాలు, జిల్లాలు, వర్గాల మధ్య అసమానత వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ దానిని నియంత్రించకుండా వదిలేస్తే, ప్రపంచాన్ని సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యం సాధించకుండా చేస్తుందని, అది ఎవరినీ వదిలిపెట్టదు’ అని నివేదిక పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img