Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఈడీ విచారణకు హాజరైన రవితేజ

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఇప్పటికే పలువురు సినిమా తారలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఛార్మి కౌర్‌, నందు, రానా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. రవితేజ బ్యాక్‌ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. మనీలాండరింగ్‌ కోణంలో రవితేజ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ క్లబ్‌ గురించి కూడా ప్రశ్నలు అడగనున్నారని తెలుస్తుంది. అలాగే రవి తేజ తోపాటు అతడి డ్రైవర్‌ శ్రీనివాస్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు.డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్‌ ను కూడా ఇప్పటికే అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అతడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు లొంగిపోవడంతో అధికారులు అతడి నుంచి కీలక వివరాలు రాబట్టారు. కెల్విన్‌ ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img