Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కోనసీమకు అంబేద్కర్‌ పేరు

సర్వారాయ సాగర్‌కు నర్రెడ్డి శివరామిరెడ్డి పేరు
వైద్యశాఖలో భారీగా నియామకాలు
అమ్మఒడి, మరో 4 పథకాలకు ఆమోదం
రాజ్‌భవన్‌లో కొత్తగా 100 పోస్టులు
వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌కు 3148 ఎకరాలు
ఆర్చర్‌ జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్‌
ఆక్వా రైతులకు విద్యుత్‌ చార్జీల్లో సబ్సిడీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును ఖరారు చేసింది. అలాగే వైఎస్సార్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూర్‌ గ్రామంలో ఉన్న సర్వారాయ సాగర్‌ రిజర్వాయర్‌ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్‌గా మార్పు చేస్తూ.. జలవనరులశాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో కేబినెట్‌ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈనెల 27న అమలుకానున్న జగనన్న అమ్మఒడి పథకంతో పాటు 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జులైలో అమలు చేయనున్న నాలుగు జగనన్న విద్యా కానుక, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, జగనన్న తోడు పథకాలను కేబినెట్‌ ఆమోదించింది. వివిధ పథకాలకు అర్హులై ఉండి మిగిలిపోయిన లబ్ధిదారులకు జులై 26న లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు తెలియజేశారు. మన పిల్లలను ప్రపంచంలోనే విద్యారంగంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి బైౖజూస్‌ కంటెంట్‌ను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందించాలని

సమావేశం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 4.7 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు ఈ యేడాది నుంచి ట్యాబ్స్‌ ఇవ్వనున్నామని చెప్పారు. అమ్మఒడి కింద మొత్తం రూ.6,594.6 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుండగా, దీనివల్ల మొత్తం 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వీరిలో 54శాతం బీసీలు, 21శాతం ఎస్సీలు, 6శాతం ఎస్టీలు, 19శాతం ఓసీలున్నట్లు తెలిపారు.
మంత్రివర్గ ఆమోదించిన మరికొన్ని కీలక నిర్ణయాలు…
. వంశధార ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు పరిహారంగా రూ.216.71 కోట్లుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.
అ యూనివర్సిటీలు, కార్పొరేషన్‌, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆమోదం
. 70 యేళ్లు పైబడిన పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ జూలై 1 2019 నుంచి మార్చి 31 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదని, పెన్షనర్‌ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌ మరణిస్తే అంతిమసంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాల అమలుకు ఆదేశం
. అర్జున అవార్జు గ్రహీత, ప్రముఖ ఆర్చర్‌ జ్యోతి సురేఖ వెన్నంకు గ్రూప్‌ 1 సర్వీసు ఉద్యోగం కింద డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులో నియామకానికి సంబంధించి అసెంబ్లీలో పెట్టనున్న బిల్లుకు ఆమోదం
. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మిస్తున్న కొత్త మెడికల్‌ కాలేజీలలో ఒక్కొక్క కాలేజీలో 706 ఉద్యోగాల చొప్పున మొత్తంగా 3530 కొత్త పోస్టులు భర్తీ
. వైద్యవిధానపరిషత్‌కు సంబంధించిన ఆసుపత్రులలో పడకల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడానికిగాను అదనంగా మరో 2558 పోస్టులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం.
. ఆక్వాసాగు చేస్తున్న రైతులకు ఊరటగా విద్యుత్‌ చార్జీలలో సబ్సిడీ.
అ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.500 కోట్ల రుణాలకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం.
. అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు 3700 మెగావాట్ల హైడ్రో పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌
. ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పునర్‌వ్యవస్థీకరణ. కొత్త పోస్టుల భర్తీ, ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ బలోపేతానికి నిర్ణయం.
. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఏంఐజీ లే ఔట్స్‌లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధికి సంబంధించి విధి, విధానాలకు ఆమోదం.
. మానసిక, శారీరక దివ్యాంగులకు, అనాథలకు, నిరుపేదలకు సేవలు అందిస్తున్న వివిధ ఛారిటబుల్‌ సంస్థలకు ఇచ్చిన లీజు కాలాన్ని పొడిగించేందుకు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు అనుమతి
. జిల్లాల పునర్విభజనతో …. 13 పాత జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ చైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగించాలని నిర్ణయం
అ బద్వేలులో కొత్తగా ఏర్పాటైన సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో 26 పోస్టులు, ఆర్డీవో ఆఫీస్‌లో 20 పోస్టుల నియామకం
. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు
. వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 3148.68 ఎకరాలు. ఈ భూమి విలువను ప్రభుత్వ ఈక్విటీగా పరిగణించేందుకు ఆమోదం.
. రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం.
. హైకోర్టు ఆదేశాల మేరకు డిసిఫ్లీనరీ ప్రొసీడిరగ్స్‌ ట్రిబ్యునల్‌ రద్దు చేస్తూ కేబినెట్‌ ఆమోదం.
. గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో 100 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. ఈ మేరకు సర్వీసు రూల్స్‌ ఏర్పాటు.
. టూరిజం పాలసీ 2020-25 కు అనుగుణంగా తిరుపతిలో నొవొటెల్‌ బ్రాండ్‌ కింద హోటల్‌ నిర్మాణానికి లీజు విధానంలో భూమి కేటాయింపు
. హరే కృష్ణా మూవ్‌మెంట్‌ మరియు దేవాదాయశాఖ మధ్య భూమి లీజు ఒప్పందం విషయంలో స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు
. అక్టోబరు 2018లో తిత్లీ తుఫాను కారణంగా దెబ్బతిన్న 90,789 మంది రైతులకు రూ.182,60,06,490 అదనపు ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఆమోదం.
. జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటిగ్రేటెడ్‌ టూరిజం ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు 1131.39 ఎకరాల స్ధలం కేటాయింపు
. సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం.
. ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్ట్‌ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img