Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఖబడ్దార్‌…

ఆడబిడ్డల జోలికొస్తే… అదే చివరి రోజు

. శిక్ష తప్పదనేలా భయం కల్పించాలి
. సిబ్బందిలో అలసత్వం సహించబోం
. హోంశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడబిడ్డల జోలికి వస్తే… అదే తమకు చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్థం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలని, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పనిచేయాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తయితే… అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బుధవారం హోంశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజల భద్రతకు గట్టి భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనిచేయాలని, పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని చెప్పారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో తొలుత గత పదేళ్లలో పోలీసు శాఖలో నెలకొన్న పరిస్థితులపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 2014-19 పోల్చితే 2019-24లో క్రైం రేట్‌ 46శాతం పెరిగిందన్నారు. 2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్‌ నేరాలు 134.43 శాతం పెరిగాయని, గంజాయి, డ్రగ్స్‌ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడిరచారు. గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్యమైందో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు ఉంటే అందులో 88 పనిచేస్తున్నాయని తెలిపారు. బాడీ వోర్న్‌ కెమేరాలు 1250 ఉంటే 444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమేరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని చంద్రబాబుకు వివరించారు. ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టం కూడా పనిచేయడం లేదని, వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవసరమైన రూ.30 కోట్లు నిధుల్ని గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు సీఎంకు వివరించారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య 5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని… ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్‌ అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్థల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండిరగులో ఉన్న రూ.10 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమేరాల ఏర్పాటులో పెండిరగులో ఉన్న రూ.11కోట్ల బిల్లులనూ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్‌ శాఖను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుదల చేయడానికి సీఎం ఆమోదించారు. గత ప్రభుత్వం పోలీసులను కక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుంది కానీ, పోలీసు శాఖ సామర్థ్యం మాత్రం పెంచలేదని అన్నారు. నేర పరిశోధనలో కీలకమైన ఫింగర్‌ ప్రింట్‌ వంటి విభాగాలకు, పరికరాలకు కనీసం రూ.10 కోట్లు నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా ర్యాలీలు చేద్దామని, ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని సీఎం చెప్పారు. ఈ సమీక్షలో భాగంగా విపత్తు నిర్వహణ సంస్థకు తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25 శాతం నిధులు ఇవ్వక పోగా…కేంద్ర నుంచి వచ్చిన నిధులనూ దారి మళ్లించారని సీఎంకు అధికారులు వివరించారు. దీనిపై సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చిన సమయంలో వెంటనే సంబంధిత శాఖలు సమన్వయంతో కేంద్రానికి నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img