Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

గెలుపు ధీమా!

. ఫలితాలకు ముందే వైసీపీ, టీడీపీ నేతల ప్రగల్బాలు
. పదవుల కోసం అధినేతలకు గాలం
. సీఎం ప్రమాణస్వీకార ప్రాంతాలను వెల్లడిస్తున్న వైనం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందే…రాష్ట్రంలో ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. తమదే అధికారం…కాదు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పోటాపోటీగా మీడియా ముందుకు నేతలు వస్తున్నారు. అంతటితో ఆగకుండా… ఏకంగా తమ అధినేతలు సీఎంగా ప్రమాణం చేసే ప్రాంతాలను, తేదీలను ప్రకటిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో తెలియకుండానే ఓటర్లతో రాజకీయ నేతలు బుర్రాట (మైండ్‌గేమ్‌) ఆడుతున్నారు. వైసీపీ, ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ… ఏకంగా ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతాలపై దృష్టి పెట్టేశాయి. అధికార వైసీపీ విషయానికే వస్తే… అధినేత వైఎస్‌ జగన్‌ నుంచి పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు వచ్చే ఎన్నికల్లో తాము క్లీన్‌ స్వీప్‌ చేయబోతున్నామని మీడియాకు వెల్లడిరచారు. అంతటితో ఆగకుండా జూన్‌ 9న విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఎన్నికల ముగిసిన రెండు రోజుల తర్వాత సీఎం జగన్‌ ఐప్యాక్‌ బృందంతో భేటీ అయ్యి… తాము గతం కంటే అనగా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లకుపైగా గెలుస్తామన్నారు. అదే మాటను వైసీపీ ముఖ్యనేతలు అనుసరించి ఈసారి కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ నేతల్లో గెలుపుపై ఎక్కడా ఆందోళన కన్పించడం లేదు. విశాఖపట్నంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. వైసీపీ మొదటి నుంచి మూడు రాజధానుల నినాదంతో ఉంది. ఆ దిశగా ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ… అందులో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే…ఈ విడత జగన్‌ విశాఖ లోనే ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని విశాఖ ఎన్నికల సభల్లోను సీఎం జగన్‌ ప్రకటించిన విషయం విదితమే. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు వచ్చాయి. కాగా ఈ ఎన్నికల్లోను భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతున్నారన్న విమర్శలున్నాయి. 2019 ఎన్నిలతో పోలిస్తే 2024ఎన్నికల నాటికి చాలా రాజకీయ సమీకరణాలు మారాయి. ఎన్డీఏ కూటమి(బీజేపీ, టీడీపీ, జనసేన) ఈ విడత అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది. ఈ కూటమికి చెందిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలంతా అభ్యర్థుల గెలుపు కోసం పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ పూర్తయ్యాక గెలుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. వచ్చేదీ ఎన్డీఏ కూటమి పార్టీనేనని చెబుతున్నారు. అయితే కూటమికి చెందిన ముఖ్యనేతలు చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి సైతం ఎన్నిసీట్లు వస్తాయనేదీ గట్టిగా చెప్పలేకపోతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతోనే మీడియా ముందు లీక్‌లు ఇప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని, అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న చెప్పారు. వైసీపీ నేతలేమో… విశాఖ కేంద్రంగా సీఎం జగన్‌ ప్రమాణం అంటే…అందుకు పోటీగా టీడీపీ నేతలు…అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని నొక్కిచెబుతున్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలోనూ అమరావతి కేంద్రంగానే రాజధాని కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం కాలేదు.
ఎమ్మెల్సీ, మంత్రి పదవుల కోసం హడావుడి
ఈ ఎన్నికల్లో దాదాపు 25 మంది వైసీపీ సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవులను సామాజిక సమీకరణల ఆధారంగా, రెండు విడతలుగా కేటాయించారు. అప్పుడు మంత్రి పదవులు దక్కని వారంతా అసంతృప్తికి గురయ్యారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వ వస్తే… రాని వారికి ఇస్తారనే ఆశతో ఉన్నారు. దీంతో అవకాశం దొరికినప్పడుల్లా మీడియా మందుకు వచ్చి… ప్రభుత్వం ఏర్పాటుపై సొంత విశ్లేషణలు చేసుకుంటూ సానుకూలంగా మాట్లాడుకోవడం చర్చానీయాంశంగా మారింది.ఇదే తరహాగా చాలా మంది టీడీపీనేతలకు టికెట్లు దక్కలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తమకు ఎమ్మెల్సీ పదవులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. వైసీపీ నేతలకు పోటీగా విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న మీడియా ముందుకు వచ్చి అదిగో ప్రభుత్వం..ఇదిగో ప్రభుత్వం అంటూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ, ఎన్డీఏ పార్టీలు వారికి అనుకూలంగా సర్వేలను చేయించుకున్నారు.
వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయిస్తూ సంతృప్తి పొందుతున్నారు. పైకి గంభీరంగానే ఉంటూ… లోలోపల మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నట్లు కన్పిస్తున్నారు. గెలుపోటములపై ఆయా పార్టీలకు చెందిన నేతలు పందేలు కట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. కౌంటింగ్‌కు ఇంకా పది రోజులే సమయం ఉంది. ఈనెల 13వ తేదీన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు…జూన్‌ 4వ తేదీన వెల్లడి కానుండగా…ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదీ స్పష్టంకానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img