Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జగన్‌కు..

. బస్సు యాత్రకు వైసీపీ నేతల డుమ్మా
. నెల్లూరులో ఆనం విజయ్‌ అసంతృప్తి
. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి దూరం
. ఎన్‌డీఏ కూటమి వైపు చూపు!

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న బస్సు యాత్రకు కీలక నేతలు దూరంగా ఉన్నారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాకు చెందిన నేతలు డుమ్మా కొట్టడం వైసీపీకి పెద్ద షాక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయించడంతో వైసీపీకి అక్కడ బలమైన నాయకత్వం కొరవడిరది. దీనిని దృష్టిలో ఉంచుకునే అక్కడ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని నియమించారు. జగన్‌ బస్సు యాత్రతో అంతా సద్దుమణుగుతుందని ఆశించినప్పటికీ నేతలు డుమ్మా కొట్టడంతో నిరాశే మిగిలింది. నెల్లూరుకు చెందిన ఆనం విజయ్‌కుమార్‌, ఆయన మరో సోదరుడు వైసీపీలోనే ఉన్నారు. ఆనం విజయ్‌కుమార్‌ సతీమణి ఆనం అరుణమ్మకు నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చారు. బస్సు యాత్రలో జగన్‌ విరామం చేసినన ప్రాంతంలో ఆయనను కలిసేందుకు ఆనం విజయ్‌కుమార్‌, ఆయన సోదరుడికి అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. దీంతో అక్కడ జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభా వేదికపై వారు దూరంగా ఉండటంతో వైసీపీలో టెన్షన్‌ మొదలైంది. ప్రకాశం జిల్లాలోనూ జగన్‌ బస్సు యాత్రకు దర్శి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, ఆయన సోదరుడు శ్రీధర్‌ డుమ్మా కొట్టారు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పుల్లో భాగంగా మద్దిశెట్టిని కాదని, బూచేపల్లిని అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో తనను కాదని బూచేపల్లికి ఇవ్వడంపై మద్దిశెట్టి మనస్తాపం చెంది, అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. త్వరలో మద్దిశెట్టి సోదరులు ఎన్‌డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీలో చేరతారన్న ప్రచారం ఉంది. వారంతా దర్శి నియోజకవర్గంలో సొంత నాయకత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి చక్రం తిప్పేందుకుగాను మద్దిశెట్టి సోదరులు వ్యూహం రచిస్తున్నారు. మొదటినుంచి దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లికి, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వైసీపీ తుది జాబితాలో మద్దిశెట్టికి చోటు దక్కకపోవడంతో ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆర్థర్‌, ఎలిజా, ఎం.ఎస్‌.బాబు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడారు. వైసీపీకి రాజీనామాలు చేసిన వారిలో కొందరు టీడీపీలోను, మరికొందరు కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. 21 రోజులపాటు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే 11 రోజులు పూర్తయింది. ఈ బస్సు యాత్ర ముగిసేలోపు మరికొందరు కీలక నేతలు వైసీపీని వీడే అవకాశాలున్నాయి. వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు, చేర్పుల్లో భాగంగా 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు లభించలేదు. వారిలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. జగన్‌ బస్సు యాత్ర ముగిసే నాటికి కొందరు కీలక నేతలు పార్టీని వీడతారని సమాచారం. మరోవైపు టీడీపీ, జనసేన నుంచి వైసీపీలోకి పెద్దఎత్తున చేరుతున్నారు. జగన్‌ బస్సు యాత్ర చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారు. బస్సు యాత్ర ముగిసేనాటికి టీడీపీ, జనసేనలోని అసంతృప్త నేతలంతా వైసీపీలోకి చేరతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img