Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ సమన్లు

అక్రమ మైనింగ్‌ కేసులో ప్రశ్నించనున్న ఈడీ
సోరెన్‌ అనుచరుడు మిశ్రా ఇప్పటికే అరెస్ట్‌

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ కేసులో తమ ముందు విచారణకు నవంబర్‌ 3న హాజరు కావాలని కోరింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సోరెన్‌ అనుచరుడైన పంకజ్‌ మిశ్రాను అరెస్ట్‌ చేసింది. అలాగే జులై 8న జార్ఖండ్‌లోని 18 ప్రాంతాల్లో పంకజ్‌ మిశ్రాకు సంబంధించిన నివాసాలు, అతడి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి సోరెన్‌ ప్రతినిధిగా పంకజ్‌ మిశ్రా అక్రమ మైనింగ్‌, పడవల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు ఈడీ గుర్తించింది. అతడి నుంచి ఇప్పటి వరకు రూ.42 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి సోరెన్‌ నుంచి మరింత సమాచారం కోసం ఈడీ ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img